ప్రయాణీకుల్ని ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు తరచూ వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్రీడమ్ సేల్ వచ్చింది. ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని అతి తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్ అందిస్తోంది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎయిర్ ఇండియా కొత్తగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆఫర్ ప్రకటించింది. 79వ ఇండిపెండెన్స్ డేలో భాగంగా ఈ ఫ్రీడమ్ సేల్ అందుబాటులో తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రాజమండ్రి-హైదరాబాద్ బస్సు టికెట్ ధరకే విమానంలో ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. మీరు ఊహించని ధరకే ఫ్లైట్ జర్నీ చేయవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆఫర్‌లో డొమెస్టిక్ విమానాల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ విమానాల్లో కూడా ప్రయాణం చేయవచ్చు. అంటే దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో కూడా ఎయిర్ ఇండియా ఆఫర్ వర్తిస్తుంది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్ గురించి వివరించింది. రెండు డొమెస్టిక్, ఇంటర్నేషల్ విమాన టికెట్ ధరల్ని ఈ ఆఫర్‌లో అందిస్తోంది. అలాగని జర్నీ ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకుంటే వచ్చే వేసవి వరకూ ఎప్పుడైనా ఈ ఆఫర్ ఉపయోగించుకుని తక్కువ ధరకే ప్రయాణం చేయవచ్చు. అయితే ఆగస్టు 15లోగా సంబంధిత టికెట్ బుక్ చేసుకోవల్సి ఉంటుంది. అంటే మరో నాలుగు రోజులే అవకాశం ఉంది. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 15 మధ్యలో టికెట్ బుక్ చేసుకుంటే వచ్చే ఏడాది వేసవి వరకూ జర్నీ చేసే అవకాశం ఉంటుంది. 2025 ఆగస్టు 19 నుంచి 2026 మార్చ్ 31 వరకూ ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేయవచ్చు. అంటే ఓనం, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి ఇలాంటి సమయాల్లో జర్నీ చేయవచ్చు.
ఎయిర్ ఇండియా ఆఫర్ టికెట్ ధర ఎంత
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్రీడమ్ సేల్‌లో డొమెస్టిక్ టికెట్ ధర కేవలం 1279 రూపాయల నుంచి ప్రారంభమౌతుంది. ఇక ఇంటర్నేషనల్ టికెట్ అయితే కేవలం 4279 రూపాయల నుంచి మొదలు కానుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రోజుకు 500 విమానాలు నడుస్తుండగా అందులో 38 డొమెస్టిక్ ఉంటే 17 ఇంటర్నేషనల్ డెస్టినేషన్లు ఉన్నాయి. దీనికితోడు జీరో చెక్ ఇన్ బ్యాగేజ్ ఆప్షన్ ఉంది. ఎక్స్‌ప్రెస్ వ్యాల్యూ కింద చెకింగ్ బ్యాగేజ్ డొమెస్టిక్ మార్గాల్లో 1379 రూపాయలు, ఇంటర్నేషనల్ రూట్స్‌లో 4479 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌లో భాగంగా అందిస్తున్న ఈ ఆఫర్ ఉపయోగించుకుంటే దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. అదనపు లగేజ్‌పై 20 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. డొమెస్టిక్ లేదా ఇంటర్నేషనల్ డిస్కౌంట్ టికెట్లు ఏయే రూట్లలో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలంటే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు లభిస్తాయి.