మెగా కోడలు వివిధ అంశాలపై వెల్లడించిన అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంతా ఆసక్తి రేపుతున్నాయి. కర్లీ టేల్స్ ఇంటర్వ్యూలో తెలిపిన విషయాలు ఫ్యాన్స్‌లో సందడి రేపుతున్నాయి.
కర్లీ టేల్స్ ఇంటర్వ్యూలో మెగా కోడలు ఉపాసన ఆసక్తికరమైన అంశాలు షేర్ చేసింది. నెట్టింట ఈ ఇంటర్వ్యూ అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రామ్ చరణ్-చెర్రీ ప్రేమ గురించి, చిరంజీవి కుటుంబ విషయాలు, తన కుటుంబ నేపధ్యం, మరీ ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్ గురించి వివరించింది. ఈ క్రమంలో చిరంజీవి ఇంట్లో ఫుడ్ హ్యాబిట్స్, తన ఇంట్లో ఫుడ్ హ్యాబిట్స్ మధ్య అంతరం ఎలా ఉండేదో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆంధ్రా ఫుడ్‌కు తన కుటుంబం చాలావరకు దూరంగా ఉండేదని తెలిపింది. ముఖ్యంగా కూరగాయలు లేదా చేపల పులుసు గురించి తక్కువ తెలుసని చెప్పింది.
మా కుటుంబంలో ఉర్దూ కల్చర్ ఎక్కువ
ఆంధ్రా ఫుడ్స్ కావచ్చు లేదా వివిధ రకాల కూరగాయల వంటలు తన కుటుంబంలో అంతగా ఉండేవి కావని ఉపాసన తెలిపింది. ఎందుకంటే తన కుటుంబంలో ఉర్దూ కల్చర్ చాలా ఎక్కువని తెలిపింది. తన తండ్రి నిజాం సంస్థానం నుంచి రావడం వల్ల నిజాం ప్రభావం ఎక్కువగా ఉండేదని చెప్పింది. అంతేకాకుండా తన గ్రాండ్ మదర్ సైతం చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో కాన్వెంట్ చదువు కావడం వల్ల అంతా నిజాం ఫుడ్ హ్యాబిట్స్ ఉండేని తెలిపింది. అందుకే చేపల పులుసు వంటి ఆంధ్రా వంటలు చెర్రీ కుటుంబంలో వచ్చాక తింటున్నానని తెలిపింది.
హైదరాబాదీ ఫుడ్స్ అంటే అమితంగా ఇష్టమని చెప్పింది. తన ఫుడ్ హ్యాబిట్స్ పెళ్లికి ముందు తరువాత చాలా మారిపోయాయని పేర్కొంది. హైదరాబాదీ అథెంటిక్ ఫుడ్ వాస్తవానికి స్పైసీ కాదని కానీ టర్కిష్ ప్రభావంతో స్పైసీగా మారిందని వివరించింది. పెళ్లి తరువాత సీ ఫుడ్స్ లేదా రొయ్యలు, చేపలు వంటివి అలవాటైందని తెలిపింది.