టాలీవుడ్‌లో ది బెస్ట్ కపుల్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంట రామ్ చరణ్-ఉపాసన. సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వీరిద్దరూ.. చాలా డౌన్ టు ఎర్త్‌గా కనిపిస్తారు. తండ్రి మెగాస్టార్ అని ఎక్కడా ఫోజులు కొట్టడు రామ్ చరణ్. అలాగే ఉపాసన కూడా ఉంటారు
టాలీవుడ్‌లో ది బెస్ట్ కపుల్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంట రామ్ చరణ్-ఉపాసన. సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వీరిద్దరూ.. చాలా డౌన్ టు ఎర్త్‌గా కనిపిస్తారు. తండ్రి మెగాస్టార్ అని ఎక్కడా ఫోజులు కొట్టడు రామ్ చరణ్. అలాగే ఉపాసన కూడా ఉంటారు. అయితే ఈ జంట ఎక్కడ కనిపించినా చాలా అన్యోన్యంగా, హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు. పెళ్లైన 11 ఏళ్లకు రామ్ చరణ్-ఉపాసనలు తల్లిదండ్రులు అయిన సంగతి విదితమే. పాపకు క్లీంకారా అని నామకరణం చేశారు. అయితే ఇప్పటి వరకు పాప రూపు రేఖలు ఎక్కడా కనబడకుండా జాగ్రత్తపడిందీ కుటుంబం. తాజాగా పాప తొలి ఫోటోను షేర్ చేశారు ఉపాసన. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్లాగ్ హోస్ట్ చేస్తున్న చిన్నారి ఫోటోను కాస్త రివీల్ చేశారు.
తన తల్లిదండ్రులతో కలిసి పాప జెండా హోస్ట్ చేస్తున్న ఫోటోను ఉపసాన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బహిర్గతం చేశారు. అందులో ఉపాసన తల్లి పాప క్లీంకారాను ఎత్తుకుని ఉన్నారు. ‘తన అమ్మమ్మ-తాతయ్యలతో క్లీంకార మొదటి స్వాతంత్య్ర వేడుకలు. ఇవి ఎంతో అమూల్యమైన క్షణాలు’ అని రాశారు. అందులో పాప గ్రీన్ అండ్ వైట్ కలర్ ఫ్రాక్ లో కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరలవుతుండగా.. ఇది చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం రామ్ చరణ్ అన్న పోలికే అంటూ కామెంట్లు పెడుతున్నారు.