సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా కన్పించే మెగా కోడలు ఉపాసన ఈ మధ్యన ఫ్యామిలీ విషయాలు అప్ డేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మామగారు చిరంజీవి, భర్త రామ్ చరణ్‌ల గురించి క్రేజీ అంశాలు షేర్ చేస్తుంటుంది. చెర్రీకు తాను పెట్టిన ప్రేమ పరీక్ష గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
రామ్ చరణ్-ఉపాసనలది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లో కన్పించే మామూలు ప్రేమ కాదని ఉపాసన అంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్‌డేట్స్ షేర్ చేసే ఉపాసన ఈ మద్యన కుటుంబ విషయాలు అభిమానులతో పంచుకుంటోంది. ముఖ్యంగా చిరంజీవి గురించి, చెర్రీ గురించి ఎవరికీ తెలియని విషయాలు రివీల్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించింది. రామ్ చరణ్ తన మధ్య సాగిన ప్రేమ విషయాలు షేర్ చేసింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు తాను చెర్రీకు పెట్టిన ప్రేమ పరీక్ష ఏంటో అందరికీ వివరించింది.
ఆ ప్రేమ పరీక్షలో చెర్రీ పాస్ అయ్యాడా
రామ్ చరణ్ – ఉపాసన లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ వెనుక చాలా అంశాలున్నాయి. ఇద్దరి మధ్య ప్రేమ సాదాసీదాగా జరగలేదు. ప్రేమ పరీక్షలు కూడా ఎదుర్కొన్నాడు చెర్రీ. రామ్ చరణ్‌కు ఉపాసన ఓ పరీక్ష పెట్టింది. తనని నిజంగా ప్రేమిస్తే చార్మినార్ వద్ద ఉన్న ప్రముఖ ఐస్ క్రీమ్ సెంటర్‌కు తీసుకెళ్లాలనేది ఉపాసన చెర్రీకు పెట్టిన పరీక్ష. తప్పదు కదా..అలాగేనంటూ చార్మినార్‌కు తీసుకెళ్లాడు. కానీ చెర్రీని గుర్తు పట్టిన అభిమానులు ఒక్కసారిగా మీదపడిపోయారు. ఇదే తాను పెట్టిన నిజమైన ప్రేమ పరీక్షని ఉపాసన చెప్పుకొచ్చింది.
చిరంజీవి చెర్రీల వీక్‌నెస్ అదే
మెగాకోడలు ఉపాసన భర్త, మామల గురించి చాలామందికి తెలియని విషయాలు కూడా షేర్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ ఫుడ్ లవర్స్ అని అందరికీ తెలిసిందే అయినా ఇండియన్ ఫుడ్ కావాలని పట్టుబడుతుంటారని చెప్పింది. ప్రపంచంలోని ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా ఇండియన్ ఫుడ్ కావాలంటారని తెలిపింది. ఇండియన్ ఫుడ్ లేకుండా లంచ్ లేదా డిన్నర్ పూర్తి కాదని చెప్పింది.