మెగా కోడలిగా, అపోలో ఛారిటీ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతల్లో బిజీగా ఉన్న ఉపాసన కొణిదెల మరోసారి కీలక విషయాలు షేర్ చేసింది. ఇంటి సంగతుల్ని ఎప్పుడూ సోషల్ మీడియా ఫ్యాన్స్‌తో పంచుకునే ఆమె ఈసారి ఇంకొన్ని సీక్రెట్ల్ రివీల్ చేసింది.
మెగాకోడలు ఉపాసన ఇటీవలే అత్తమ్మ కిచెన్ పేరుతో డ్రై హోమ్ ఫుడ్స్ వెంచర్ ప్రారంభించింది. అయితే ఈ వెంచర్ ప్రారంభం వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపధ్యం గురించి చాలామందికి తెలియదు. ఇటీవల ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసింది. తన భర్త రామ్ చరణ్, మామగారు చిరంజీవి బెస్ట్ భోజన ప్రియులని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఎక్కడికి వెళ్లినా సరే..ఆఖరికి విదేశాల్లో ఉన్నా అదే పని చేస్తారని తెలిపింది. ప్రపంచ విఖ్యాత రెస్టారెంట్‌కు వెళ్లినా సరే సౌత్ ఇండియన్ మీల్ తప్పకుండా అడుగుతారని చెప్పింది. ఈ ఇద్దరికి ఉన్న ఈ అలవాటే తనను సొంతంగా డ్రై హోమ్ ఫుడ్స్ వెంచర్ ప్రారంభించేందుకు కారణమైందని తెలిపింది.
విదేశాల్లో ఉన్నా అది కావల్సిందే
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు షేర్ చేసింది ఉపాసన. తన భర్త చెర్రీ లేదా మామగారు చిరంజీవి విదేశాల్లో ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లినా సరే అంతా బాగుంది…కానీ సౌత్ ఇండియన్ మీల్ ఏదని అడుగుతారని చెప్పింది. రాత్రి 11.30 గంటలకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ఏం తిన్నా సరే ఒక మీల్ సౌత్ ఇండియన్ ఉండాల్సిందేనంటోంది. అందుకే తాను వివిధ రకాలుగా ప్రయత్నాలు చేశానంది. తన సౌలభ్యం కోసం డ్రై హోమ్ ఫుడ్స్ వెంచర్ ప్రారంభించానని క్రమంగా అది అత్తమ్మ కిచెన్‌గా మారిందని తెలిపింది.
ఈ అలవాటు కేవలం చెర్రీకు మాత్రమే కాదని, మామగారైన చిరంజీవికి కూడా ఉందని ఉపాసన వివరించింది. ట్రావెలింగ్‌లో ఉన్నా కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ కోసం అడుగుతుంటారని ఉపాసన వెల్లడించింది. తన అత్తమ్మ సురేఖ కొన్ని ప్రీ మిక్స్డ్ హోమ్ ఫుడ్స్ సిద్ధం చేసి ఇచ్చేవారని అదే క్రమంగా అత్తమ్మ కిచెన్ వెంచర్‌గా మారిందని పేర్కొంది. ఇందులో కొద్దిగా హాట్ వాటర్ వేస్తే హోమ్ పుడ్ సిద్ధమైనట్టే.