ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుష్ ఇక. పాన్ ఇండియా రెబెల్ స్టార్ రాజాసాబ్ సంక్రాంతికి రానున్నాడు. సంక్రాంతి రేసులో ఇతర సినిమాలతో పోటీ పడేందుకు ప్రభాస్ సిద్ధమౌతున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రెబెల్ స్టార్ అండ్ డార్లింగ్ నటించిన రాజాసాబ్ సినిమా విడుదలపై సందిగ్దత వీడింది. అధికారికంగా రిలీజ్ డేట్ విడుదలైంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి రానుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్వయంగా వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించగా మారుతి తెరకెక్కించారు.
వీడిన రిలీజ్ డేట్ సస్పెన్స్
వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల కానుందనే ప్రచారం జరిగింది. అధికారికంగా ప్రకటించకపోవడంతో సందిగ్దత నెలకొంది. ఎట్టకేలకు ఇప్పుడీ సస్పెన్స్ వీడింది. మిరాయ్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి పురస్కరించుకుని జనవరి 9న విడుదల కానుందని వెల్లడించారు.
రాజాసాబ్ సంక్రాంతికి విడుదల నిర్ధారణ కావడంతో ఈసారి పోటీ గట్టిగానే ఉండనుంది. ఎందుకంటే మెగాస్టార్ మన శంకర్ వరప్రసాద్ గారు కూడా సంక్రాంతికి వస్తుండగా, అనగనగా ఒక రోజు, విజయ్ సినిమా జన నాయగన్ కూడా రానున్న సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. రాజాసాబ్ అనేది భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన హర్రర్ కామెడీ సినిమా. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్ర పోషించనున్నాడు. థమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది.