టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు శ్రీశాంత్ వర్సెస్ హర్భజన్ సింగ్ ఘర్షణ వీడియో 17 ఏళ్ల తరువాత వెలుగుచూసింది. ఇన్నాళ్లూ బయటకు రాని ఈ వీడియో ఇప్పుడు లీక్ అవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీశాంత్ భార్య ఇదే అంశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎప్పుడో 17 ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఇది. ఐపీఎల్ 2008 జరుగుతున్నప్పుడు అందరి ముందు టీమ్ ఇండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ తోటి క్రికెటర్‌పై చేయి చేసుకున్నాడు. గ్రౌండ్‌లో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం కాస్తా ఘర్షణ దారి తీసి శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టే వరకు వెళ్లింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన సందర్భంగా ఈ ఘర్షణ జరిగింది. దాంతో అప్పట్లో హర్భజన్ సింగ్‌పై 11 మ్యాచ్‌ల నిషేధం, మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. ఈ ఘటన ప్రభావం శ్రీశాంత్ కెరీర్‌పై కూడా పడింది. అయితే ఈ వీడియో ఇన్నాళ్లూ బయటకు రాలేదు. ఆ సమయంలో ఐపీఎల్ ఛైర్మన్‌గా వ్యవహరించిన లలిత్ మోడీ తాజాగా వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దాదాపు 17 ఏళ్ల క్రితం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు ఇలా విడుదల చేయడంపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ల తరువాత ఆ వివాదాన్ని బయటకు తీయడంపై మండిపడింది. ఇది శ్రీశాంత్‌పై చేసిన వ్యక్తిగత దాడి అని ఆమె తెలిపింది. ఈ తరహా పనులు మానుకోవాలని విజ్ఞప్తి చేసింది. శ్రీశాంత్ టీమ్ ఇండియా తరపున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ కూడా ఆడాడు.
Harbhajan Singh and Srishant Slap Kand unseen video release after 18 Years pic.twitter.com/TEqVGFUHZF
— Ankur Kashyap (@ankurs000) August 29, 2025