మరో మూడు రోజులే మిగిలుంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 లాంచ్ అయ్యేందుకు. ఈసారి డబుల్ హౌస్ డబుల్ ధమాకా అంటున్న బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల తొలి జాబితా లీకైంది. మొత్తం 16 మందిలో 11 మంది నేరుగానూ, మరో ఐదుగురు అగ్నిపరీక్ష ద్వారా ఎంట్రీ ఇవ్వునున్నారు. ఆ జాబితాలో ఎవరున్నారో తెలుసుకుందాం.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 7 గంటలకు లాంచ్ కానుంది. ఈసారి ఐదుగురు సామాన్యులు కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. బిగ్‌బాస్ 9 హౌస్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టబోతున్నారు. వీరిలో 11 మంది నేరుగా ఎంట్రీ ఇస్తే మరో ఐదుగురు అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులు ఉంటారు. అగ్నిపరీక్ష కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ షోకు ఎంత నెగెటివిటీ ఉన్నా ఆదరణ కూడా అదే స్థాయిలో ఉంటుంది. చాలామంది తిట్టుకుంటారు కానీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ఈసారి బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చేది ఎవరనేది అధికారికంగా ఇంకా తెలియలేదు. సామాన్యులు మాత్రం ఐదుమంది ఉంటారు. సెలెబ్రిటీల జాబితా నుంచి వచ్చే 11 మంది ఎవరనేది కేవలం ఊహాగానాల్లోనే ఉంది. ఈ క్రమంలోనే 11 మందితో ఓ జాబితా బయటికొచ్చింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 లీక్ జాబితా
1 జబర్దస్త్ ఫేమ్్ ఇమ్మాన్యుయేల్
2. హాస్య నటుడు సుమన్ శెట్టి
3 చిట్టి పికెల్స్ ఫేమ్ రమ్య
4. సీరియల్ నటుడు భరణి శంకర్
5. హీరోయిన్ ఆశా షైనీ
6. సీరియల్ నటి తనూజ గౌడ
7. ఫోక్ సింగర్ రాము రాథోడ్
8. హీరోయిన్ సంజనా గల్రానీ
9. కొరియోగ్రాఫర్ శ్రేష్ణి వర్మ
10. నటుడు హర్షిత్ రెడ్డి
11. అలీ భార్య జుబేదా సుల్తానా
ఇక అగ్నిపరీక్ష ద్వారా మరో ఐదుమంది బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఐదుగురిలో మాస్క్ మెన్ హరీష్, పవన్ కళ్యాణ్, శ్రీజా, ప్రియా శెట్టి, నాగ ప్రశాంత్ లేదా మనీష్ పేర్లు విన్పిస్తున్నాయి. అయితే 11 మంది జాబితాలో ఇంకా ఎవరూ అగ్రిమెంట్ సైన్ చేయలేదు. ఈ జాబితా పేర్లు కేవలం వార్తల్లో, ఊహాగానాల్లో ఉన్నవే. బిగ్‌బాస్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించలేదు.