బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమయ్యేందుకు కేవలం నాలుగు రోజుల వ్యవధి మిగిలుంది. ఇంకా సామాన్యుల ఎంపిక ప్రక్రియ జరుగుతూనే ఉంది. తాజాగా మరో ఇద్దరిని అగ్నిపరీక్ష నుంచి బయటకు పంపించేశారు. ఇక మిగిలింది టాప్ 13. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సెప్టెంబర్ 7 నుంచి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కానుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఈసారి ఐదుగురు సామాన్య వ్యక్తులుంటారు. ఈ సామాన్యుల ఎంపిక కోసం బిగ్‌బాస్ యాజమాన్యం శ్రీముఖి యాంకర్‌గా, అభిజీత్, నవదీప్, బిందుమాధవిలు న్యాయనిర్ణేతలుగా అగ్నిపరీక్ష కార్యక్రమం నిర్వహిస్తోంది. బిగ్‌బాస్‌కు ఉన్నట్టే అగ్నిపరీక్ష కార్యక్రమానికి భారీగా ఆదరణ లభిస్తోంది. అగ్నిపరీక్షకు వచ్చిన వందలాది అప్లికేషన్లను స్క్రూటినీ చేసిన 40 మందిని ఎంపిక చేశారు. ఆ తరువాత వివిధ టాస్క్‌లు, పరీక్షల ద్వారా టాప్ 15 జాబితా సిద్దమైంది. ఇందులోంచి ఐదుమందికే బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లే అవకాశముంది. తాజాగా ఈ 15 మంది నుంచి ఇద్దరికి రెండోసారి ఎల్లో కార్డ్ ఇవ్వడంతో వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుుడు టాప్ 13 మిగిలారు.
టాప్ 15 జాబితా నుంచి ప్రసన్న కుమార్, శ్వేతలకు ఎల్లో కార్డు ఇచ్చి అగ్నిపరీక్ష నుంచి తప్పించారు. ప్రసన్న కుమార్ కన్నీరు పెట్టుకోవడంతో జడ్జీలుగా వ్యవహరిస్తున్న అభిజీత్, నవదీప్‌లు సముదాయించి మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇప్పుుడు వైరల్ అవుతోంది. ఈ షో, ఈ పంచాయితీ నీతో కాదంటూ నచ్చజెప్పారు. ఇక అభిజీత్ అయితే నేను రియాలిటీ షోలో గెలిచినా నువు మాత్రం రియల్‌గా గెలిచావంటూ అభినందించాడు.