సూపర్ స్టార్ మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న అంతర్జాతీయ స్థాయి సినిమా SSMB 29పై మరో బిగ్ అప్‌డేట్ విడుదలైంది. ఈ సినిమా ఒకే భాగంలో ఉంటుందా లేక రెండు భాగాల్లో ఉంటుందా అనే సందేహాలు అభిమానుల్ని వెంటాడుతున్నాయి. ఈ అంశంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న SSMB 29 సినిమా గురించి కీలక విషయాలు బయటికొచ్చాయి. కెన్యాలోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న రాజమౌళి టీమ్ కెన్యా మంత్రి ముసాలియా ముదావాదితో సమావేశమయ్యారు. ఈ భేటీపై కెన్యా మీడియా విస్తృత ప్రచారం చేసింది. కెన్యా మంత్రి ముసాలియా కూడా తమ దేశంలో షూటింగ్ జరపడంపై ఆనందం వ్యక్తం చేశారు. తూర్పు ఆఫ్రికా అంతా పర్యటించి షూటింగ్ కోసం కెన్యా ఎంచుకోవడం ఆనందంగా ఉందన్నారు కెన్యా మంత్రి ముసాలియా ముదావాది. అంతేకాకుండా ఈ సినిమా గురించి కీలకమైన విషయాలు షేర్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల కానుందని తెలిపారు.
ఇదే సమయంలో మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. వాస్తవానికి గత కొద్దిరోజులుగా మహేశ్ బాబు అభిమానుల్లో ఈ పెద్ద సందేహం నెలకొంది. ఈ సినిమా ఎన్ని భాగాల్లో ఉంటుందనేదే ఆ సందేహం. బాహుబలి తరహాలో రెండు భాగాలుగా ఉంటుందా లేక ఒకే భాగం ఉంటుందా అనేది ఇప్పటి వరకూ తెలియదు. ఇదే ప్రశ్న ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. ఇప్పుడీ ప్రశ్నకు కూడా సమాధానం వచ్చేసింది. కెన్యా మీడియా ఈ విషయాన్ని నిర్ధారించింది.
మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న SSMB 29 సినిమా రెండు భాగాల్లో విడుదల కానుందని కెన్యా మీడియా ప్రస్తావించింది. అయితే ఇంకొందరు మాత్రం ఒకే భాగంలో ఉంటుందంటున్నారు. కెన్యాలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ది స్టార్ ప్రకారం SSMB 29 సినిమా రెండు భాగాల్లో విడుదల కానుంది. అయితే రాజమౌళి నుంచి మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. అసలు ఈ సినిమా గురించి ఏ సంగతీ అధికారికంగా బయటకు రాలేదు.
కెన్యా మంత్రి ముసాలియా ముసావాదితో రాజమౌళి భేటీ అనంతరం కొన్ని కీలక విషయాలు తెలిశాయి. ఈ సినిమా 2027 మార్చ్ 25న ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల కానుందని తెలిసింది. గతంలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ సినిమాలు ఈ స్థాయిలో 100 దేశాల్లో విడుదలయ్యాయి. ఇప్పుడు రాజమౌళి ఆ రికార్డు బ్రేక్ చేయనున్నారు. కెన్యా మీడియా అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా చెప్పేసింది. దాదాపుగా 135 మిలియన్ డాలర్లతో సినిమా తెరకెక్కనుందని తెలిపింది.