ఓటీటీ ప్రియులకు పండగే. ఈ వారం వివిధ రకాల ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో కూలీ, వార్ 2 మినహాయించి పెద్ద సినిమాల్లేవు. అయితే ఓటీటీలలో మాత్రం చాలా సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమౌతున్నాయి.
ఆగస్టు 14న విడుదలైన కూలీ, వార్ 2 మినహా పెద్ద సినిమాలు ఏవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడటం లేవు. త్వరలో అనుపమ పరమేశ్వరన్ సినిమా పరదా విడుదలకు సిద్ధమౌతోంది. అందుకే అందరూ ఓటీటీ వైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే ఓటీటీలలో చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. హరిహర వీరమల్లు, మిషన్ ఇంపాజిబుల్ 8 సహా కొత్త సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5లలో విడుదల కానున్నాయి.
కధా సుధ సిరీస్‌లో భాగంగా దొరకు సెల్ ఫోన్ వచ్చింది షార్ట్ ఫిల్మ్ ఈటీవీ విన్‌లో ప్రసారమౌతోంది. గంగనమోని శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో తణికెళ్ల భరణి ప్రధాన పాత్రలో కన్పించనున్నాడు. ఇక గత ఏడాది విడుదలైన ప్రేమ కధ సినిమా ఆగస్టు 21 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సూత్రవాక్యమ్ ఈ మద్యనే జూలై నెలలో థియేటర్లలో విడుదలైంది. ఇదిప్పుుడు తెలుగులో ఈటీవీ విన్‌లో ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా విడుదల కావచ్చు.
కేరాఫ్ కంచరపాలెం సినిమా నిర్మాత ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించిన కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా ఆగస్టు 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ కామెడీ డ్రామా సినిమాను రాణా దగ్గుబాటి సమర్పించారు. ఇక విజయ్ సేతుపతి, నిత్యామీనన్, పండిరాజ్ నటించిన తలైవన్ తలైవి సినిమా ఆగస్టు 22 నుంచి తెలుగు, తమిళం సహా ఇతర భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవబోతోంది.
పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ తాజా చిత్రం మారీసన్ ఆగస్టు 22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సుధీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ వడివేలు అనే కీలకమైన పాత్ర పోషిస్తాడు. బాలీవుడ్ నటి కాజోల్ నటించిన మా సినిమా ఆగస్టు 22 నుంచి నెట్‌ఫ్రిక్స్‌లో విడుదలవుతుంది. హాలీవుడ్ సినిమా పేస్ మేకర్ సీజన్ 2 జియో హాట్‌స్టార్‌లో ఆగస్టు 22 నుంచి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు, కిరీటి రెడ్డి కొత్త సినిమా జూనియర్ ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవనున్నాయి. మిషన్ ఇంపాజిబుల్ 8 కూడా ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో రానుంది.