జాను, సత్యం సుందరం సినిమాలతో అద్భుతమైన భావోద్వేగాన్ని పండించి ప్రేక్షకుడి కంట నీరు తెప్పించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ ఇప్పుడు యాక్షన్ డ్రామా నేపధ్యంతో సినిమా తీయనున్నాడు. అది కూడా పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ హీరోగా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పుష్ప విలన్‌గా అందర్నీ మెప్పించిన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా యాక్షన్ డ్రామా సినిమా తెరకెక్కించనున్నాడు ప్రముఖ దర్శకుడు ఫహద్ ఫాజిల్. ప్రేమ్ కుమార్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమాలు రెండు. ఒకటి విజయ్ సేతుపతి త్రిష నటించిన 96. ఇదే శర్వానంద్-సమంతలతో తెలుగులో జాను పేరుతో రీమేక్ అయింది. మరొకటి అరవింద్ స్వామి కార్తీ నటించిన సత్యం సుందరం. రెండింట్లోనూ దర్శకుడు భావోద్వేగంతో ప్రేక్షకుడి కంట నీరు తెప్పించాడు. సున్నితమైన అంశాలతో ఎమోషన్ అద్భుతంగా చూపించగలిగాడు. అందుకే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుడిని చాలా ఆకట్టుకున్నాయి. రెండింట్లోనూ భావోద్వేగమే ప్రధాన ఎలిమెంట్.
ఎమోషన్ నుంచి యాక్షన్ డ్రామా వైపుకు
అయితే ఇప్పుడీ దర్శకుడు రూట్ కాస్త మార్చినట్టు తెలుస్తోంది. పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ హీరోగా యాక్షన్ డ్రామా నేపధ్యంలో సినిమా తీయనున్నాడు. చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కించాల్సిన సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఇంకా పూర్తి కానందున..ముందుగా ఫహద్ ఫాజిల్‌తో సినిమా పూర్తి చేయాలనేది ప్రేమ్ కుమార్ ఆలోచనగా ఉంది. ఇందులో కూడా ఎమోషన్ ఉంటుంది గానీ ప్రధానంగా యాక్షన్ డ్రామా నేపధ్యంతో సాగే కధ ఇది. గతంలో తాను తీసిన సినిమాలకు భిన్నంగా ఉంటుందని ప్రేమ్ కుమార్ వెల్లడించాడు.