యువ హీరో హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా సినిమా మిరాయ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా విజువల్ రిచ్ అని చెప్పవచ్చు. ఇదొక అడ్వెంచరస్ యాక్షన్ సినిమా. సినిమాలో తేజ సజ్డాతో పాటు మంచు మనోజ్ పాత్ర కూడా చెప్పుకోదగ్గది. ఇద్దరీ నటన వేరే లెవెల్ అంటున్నారు ప్రేక్షకులు. టెక్నికల్, మ్యూజిక్ చాలా బాగుంది. గౌరహరి ఇచ్చిన బీజీఎం అదిరింది. కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా జీవించాడు. ఇక ప్రతినాయకుడి పాత్రలో మంచు మనోజ్ అద్భుతంగా ఉన్నాడు.
సినిమా కధ
బ్రాండెడ్ ఉత్పత్తులకు ఫస్ట్ కాపీలు చేసే వ్యక్తిగా హీరో తేజ సజ్జా ఉంటే ప్రతి నాయకుడిగా ఉన్న మంచు మనోజ్ అశోకుడి 9 గ్రంధాల్ని స్వాధీనం చేసుకుని ప్రపంచాన్ని ఏలే ప్రయత్నంలో ఉంటాడు. ఈ క్రమంలోనే తేజ సజ్జా వర్సెస్ మంచు మనోజ్ మధ్య ఘర్షణ, పోటీ నెలకొంటుంది.
నెరేషన్ ఎలా ఉంది
సినిమా ప్రారంభమైన 40 నిమిషాల వరకు స్లోగా ఉంటుంది. అంటే కాస్త బోర్ కొట్టవచ్చు. 40 నిమిషాల తరువాత మాత్రం సినిమా ఊపందుకుంటుంది. కధాంశం బాగానే ఉన్నా నేరేషన్ విషయంలో అంత గ్రిప్పింగ్ కన్పించలేదు. ఈగల్ వంటి సినిమాను తెరకెక్కించిన కార్తీక్ ఘట్టమనేని నుంచి ఈ సినిమా విషయంలో కాస్త అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ సగటు ప్రేక్షకుడిని కాస్త నిరాశ పర్చింది. ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమా ఫ్లాప్ ఖాతాలో రాదు. హిట్ అనే చెప్పవచ్చు. ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశాలున్నాయి.
రేటింగ్: 3/5
ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే