టిల్లూ స్క్వేర్ సినిమాతో విభిన్నంగా కన్పించిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తాజా చిత్రం పరదా రేపు ఆగస్టు 22న విడుదల కానుంది. ముందే ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో ఫరవాలేదనే టాక్ విన్పిస్తోంది. అమ్మాయిలైతే మిస్ కాకూడని సినిమా అంటున్నారు విశ్లేషకులు. పూర్తిగా ఎమోషన్ నిండిన సినిమా ఇది. పరదా రివ్యూ, రేటింగ్ వివరాలు మీ కోసం..
ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన పరదా సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్‌లో కన్పిస్తుంది. నటి సంగీత ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించింది. విజయ్ దొణకొండ, రోహిత్ కొప్పు, శ్రీధర్ మక్కువ, పీవీ శ్రీనివాసులు సినిమాను నిర్మించగా గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఇక మృదుల్ సేన్ కొరియోగ్రఫీ చేయగా ధర్మేంద్ర కరకాల ఎడిటింగ్ బాధ్యతలు వహించాడు. సినిమాలో ప్రత్యేకంగా హీరో హీరోయిన్లు ఉండరు. గ్రామ నేపధ్యం, మహిళలు పరదా ఎందుకు కప్పుకోవల్సి వచ్చింది, గ్రామాల్లో కట్టుబాట్లు, మూఢ నమ్మకాల పేరిట మహిళల్ని బయటి ప్రపంచానికి దూరం చేయడం వంటి ఘటనలను ఇతివృత్తంగా తీసుకుని చేసిన కల్పిన కధ ఇది.
పరదాలో అనుపమ నటను మెచ్చుకోవల్సిందే. బిడియం, భయం, ప్రేమ అన్నీ కన్పిస్తాయి. భయం నుంచి ధైర్యవంతురాలిగా మారిన వైనం అద్భుతంగా తెరకెక్కించారు. ఇక టెక్నికల్ టీమ్ పని తీరు బాగుంది. సినిమాటోగ్రఫీ సూపర్. సంగీతం ఫరవాలేదన్పించింది. బండి, శుభం సినిమాలు తీసిని ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. అన్నింటికీ మించి రివ్యూలు చూసి నచ్చితేనే సినిమా చూడండంటున్న అనుపమ పరమేశ్వరన్ కాన్ఫిడెన్స్ మెచ్చుకోవచ్చు.
ఈ మధ్యకాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తగ్గిన నేపధ్యంలో ఆ లోటు భర్తీ చేసేందుకు ఈ సినిమా వచ్చిందనవచ్చు. అందుకే మహిళలు అమ్మాయిలు తప్పక చూడాల్సిన సినిమాగా పరిగణిస్తున్నారు. సినిమాలో విజ్యువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. రెగ్యులర్ స్టోరీలు చూసే ప్రేక్షకులకు ఇది నచ్చకపోవచ్చు. కానీ సినిమా అంతా ఎమోషన్ నిండి ఉంటుంది.
రేటింగ్ 2.25/5
ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే