సాక్షిలో షర్మిలకు వాటా ఏదీ?
సాక్షి పత్రిక ప్రారంభం, కుటుంబ వ్యాపారాల విషయంలో షర్మిలకు వాటా ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని ఆమె గతంలో వెల్లడించారు. సాక్షి, భారతి సిమెంట్స్‌లో 60:40 నిష్పత్తిలో వాటాల పంపిణీకి జగన్ ప్రతిపాదించారని, అందులో 40 శాతం వాటా తనకు రావాల్సి ఉందని షర్మిల తన బహిరంగ లేఖలో ఆరోపించారు. అయితే, ఆ ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన వాటాలను బదిలీ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు తనకు వాటా రావాల్సిన సంస్థగానే పేర్కొన్న సాక్షి, నేడు తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించడం ఈ వివాదంలో ప్రధాన వైరుధ్యంగా మారింది.
సొంత చెల్లిపై దాడికి సాక్షి వేదికగా మారిందా?
కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు షర్మిల వెళ్లడంపై నవంబర్ 17న సాక్షి పత్రికలో ‘బాబుతో చెట్టాపట్టాల్!’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఒక కుటుంబ వేడుకకు ముఖ్యమంత్రిని ఆహ్వానించడాన్ని వ్యక్తిగత సంబంధాలపై అనుచిత వ్యాఖ్యానాలు చేసేలా చిత్రీకరించడంపై షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు చేయాల్సిన చోట ఒక మహిళ వ్యక్తిగత గౌరవం, ప్రతిష్ఠను ప్రశ్నించేలా కథనాలు రావడం ఎంతవరకు సమంజసం? కుటుంబ ఆస్తుల వివాదంలో తనకు వాటా ఇవ్వలేదని ఆరోపిస్తున్న షర్మిలపై, అదే కుటుంబంతో సంబంధం ఉన్న మీడియా సంస్థలో ఇలాంటి కథనాలు రావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

జగన్ వ్యక్తిత్వం, అన్నగా ఆయన బాధ్యత ఏమిటి?
జగన్ రాజకీయ ప్రస్థానంలో షర్మిల కీలక పాత్ర పోషించారు. తన అన్న కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, పాదయాత్రలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. కుటుంబ, రాజకీయ విభేదాల కారణంగా నేడు ఇద్దరూ వేర్వేరు రాజకీయ మార్గాల్లో ఉన్నారు. రాజకీయంగా విభేదించినంత మాత్రాన సొంత చెల్లి వ్యక్తిగత గౌరవాన్ని ప్రశ్నించేలా కథనాలు రావడం ఏ విధంగా సమర్థనీయం? ఒక మహిళ గౌరవం గురించి మాట్లాడే నాయకుడు, తన సొంత చెల్లి విషయంలోనూ అదే విలువలను పాటించాల్సిన బాధ్యత లేదా? సాక్షి కథనంపై షర్మిల నేరుగా జగన్‌ను ప్రశ్నించి క్షమాపణ కోరడం ఈ వివాదంలో కీలక అంశం.
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే… సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
— YS Sharmila (@realyssharmila) November 17, 2026
