SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » devotional » Srikalahasti Temple Fire Accident Gas Cylinder Blast

శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Thu - 12 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. లడ్డూ తయారీ కేంద్రంలో పేలిన గ్యాస్ సిలిండర్

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లడ్డూ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు అంటుకుని దట్టమైన పొగ కమ్మేసింది. ఆ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక సిబ్బంది, భక్తులు భయంతో పరుగులు తీశారు. ఇక వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో స్పాట్ చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

గురువారం మధ్యాహ్నం సమయంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని లడ్డూలు తయారీ కేంద్రంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లడ్డూ తయారీ కేంద్రంలో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ బ్లాస్ట్ సౌండ్ చాలా తీవ్రంగా రావడంతో ఆలయ పరిసరాల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. మంటలు ఎగిసిపడటంతో పాటు ఆలయ ప్రాంగణమంతా దట్టమైన పొగలు కమ్మేశాయి. ప్రమాదం జరిగిన సమయంలో లడ్డూ తయారీ కేంద్రంలో సిబ్బంది, ఉద్యోగులు తమ డ్యూటీలో నిమగ్నమై ఉన్నారు. మంటలను గమనించిన వెంటనే ప్రాణభయంతో వారంతా బయటకు పరుగులు తీశారు.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఆలయ అధికారులు అలర్ట్ అయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్, ఆలయ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, సిలిండర్ పేలుడు ధాటికి పొగలు దట్టంగా కమ్మేయడంతో లోపల పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరికైనా గాయాలయ్యాయా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అధికారులు ఆ వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.

Join Our Whatsapp Channel

నిజానికి శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలోనే ఈ లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రం ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ లక్షకు పైగా లడ్డూలను ఎంతో నిష్టతో తయారు చేస్తుంటారు. శివయ్యను దర్శనం చేసుకున్న తర్వాత భక్తులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అయితే, లడ్డూల తయారీ కోసం ఈ తయారీ కేంద్రంలో ఎప్పుడూ పెద్ద మొత్తంలో స్వచ్ఛమైన నెయ్యి, ఇతర సుగంధ ద్రవ్యాలు స్టాక్ ఉంటాయి. ప్రమాదం జరిగిన సమయంలో పొయ్యిల మీద వేడి వేడి నెయ్యి మరుగుతూ ఉంది. సరిగ్గా అదే టైమ్‌లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల మంటలు ఇంత వేగంగా వ్యాపించాయి.

ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం రావడం, ఆకాశంలోకి పొగలు ఎగసిపడటంతో లడ్డూ పోటుకు సమీపంలో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కూడా తీవ్ర భయాందోళనలకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి రావడంతో ఆలయ అధికారులు భక్తులకు, స్థానికులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న సహాయక చర్యలకు, క్లీనింగ్ ప్రాసెస్‌కు భక్తులంతా సహకరించాలని కోరారు.

Tags :

  • Andhra Pradesh News
  • Breaking News
  • Gas Cylinder Blast
  • Laddu Making Centre
  • Srikalahasti
  • Srikalahasti Temple
  • telugu news
  • Temple Fire Accident
  • Temple News
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • ఏపీలో మళ్ళీ ఎన్నికల నగారా.. 23 స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

    ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

  • ఎయిర్ ఇండియా విమానంలో హైజాక్ బెదిరింపు లేఖ.. ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర కలకలం

    ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ బెదిరింపు.. టేకాఫ్‌కు ముందు ఏం జరిగింది?

  • అస్సాంలో ఘోర రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన కోల్‌కతా–సైరంగ్ ఎక్స్‌ప్రెస్

    అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికుల్లో భయాందోళన!

  • హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ దందా.. 7 సెంటర్లకు షోకాజ్ నోటీసులు

    హైదరాబాద్‌లో అండాల అక్రమ దందా.. 7 IVF సెంటర్లలో షాకింగ్ నిజాలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

  • OG-2, OG-3 కన్ఫర్మ్? పవన్ కళ్యాణ్ సినిమాపై తమన్ బిగ్ అప్‌డేట్.. 2027లో షూటింగ్!

  • నాని సినిమాపై బాబు మోహన్ ఫైర్.. 'నా లక్కీ లెగ్ మిస్ అయింది'.. షాకింగ్ కామెంట్స్!

  • యూకే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామాయణ.. డిస్నీని వెనక్కి నెట్టి నంబర్ 1 రికార్డు!

  • శేఖర్ మాస్టర్ కారుకు యాక్సిడెంట్.. ముచ్చింతల్ వద్ద ఏం జరిగింది? తాజా అప్డేట్ ఇదే!

Most viewed

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..! 18 రైళ్లలో కీలక మార్పులు.. టికెట్ ధరలు తగ్గనున్నాయా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam