ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న జోరుగా ప్రచారానికి SEC గట్టి బ్రేక్ వేసింది. షెడ్యూల్ ప్రకటనకు మరో రెండు నెలల సమయం పడుతుందంటూ వస్తున్న వార్తలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తీవ్రంగా ఖండించారు. ఈ పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు, రాజకీయ పార్టీలు ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల కోర్టు కేసుల వల్లే ఎన్నికలు ఆలస్యమవుతున్నాయంటూ […]