బంగాళాఖాతంలో మరోసారి వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. శుక్రవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ 24 గంటల్లో అల్పపీడనంగా మారొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం అలజడిగా ఉండనుందని తెలిపింది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో సముద్రంలో జరుగుతున్న అనూహ్య పరిణామాలు ఇప్పుడు అందరిలో మళ్లీ టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక అలర్ట్ జారీ చేసింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం నాటికి మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అయ్యే ఛాన్స్ ఉందని స్పష్టమైంది. ఇది కేవలం అక్కడితో ఆగిపోకుండా, అక్కడి నుంచి వాయవ్య దిశగా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేయనుంది. ఇలా కదులుతూ తదుపరి 24 గంటల్లోనే ఇది మరింత పవర్‌ఫుల్‌గా మారి, ఒక ‘ అల్పపీడనం’ రూపంలో బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే మరింత బలపడుతున్న నేపథ్యంలో, సముద్ర తీర ప్రాంతాల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు తలెత్తనున్నాయి. ముఖ్యంగా రాబోయే శని, ఆదివారాల్లో అండమాన్ సముద్రంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతం అంతటా తీవ్రమైన అలజడి సృష్టించే ఛాన్స్ ఉంది. సముద్రంలో భారీ అలలు ఎగిసిపడే అవకాశం ఉండటంతో, మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లకూడదని APSDMA కీలక హెచ్చరిక జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే సముద్రంలో ఉంటే ఇమీడియట్‌గా సేఫ్ ప్లేస్‌కు రిటర్న్ కావాలని అధికారులు సూచిస్తున్నారు.
అయితే, మరో అల్పపీడన వార్తలు నేపథ్యంలో తీర ప్రాంత ప్రజల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాను ప్రభావంతో ఇబ్బంది పడ్డ ప్రజలు మరో తుఫాను వస్తుందేమోన్న భయంతో ఉన్నారు. ఈ టెన్షన్‌ను తొలగిస్తూ APSDMA ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో ఫామ్ అవుతున్నప్పటికీ, దీని డైరెక్ట్ ఇంపాక్ట్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మీద అంతగా ఉండే ఛాన్స్ లేదని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ, ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌ను ఫేస్ చేయడానికి స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అన్ని జిల్లాల కలెక్టర్లను అలర్ట్ మోడ్‌లో ఉంచింది.
ఓవరాల్‌గా చూస్తే, ప్రస్తుతానికి ఏపీకి ఎలాంటి ఇమీడియట్ డేంజర్ లేకపోయినప్పటికీ, వెదర్ ఫోర్‌కాస్ట్ నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
