తమిళనాడు పాలిటిక్స్ అంటేనే సినిమా వాళ్లకు పెట్టింది పేరు. రీసెంట్గా దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంతో అక్కడ రాజకీయాలు మరింత హీటెక్కాయి. విజయ్ సక్సెస్ చూశాక.. కోలీవుడ్‌లో నెక్స్ట్ లైన్ లో ఉన్నది ఎవరు? అనే చర్చ మొదలైంది. అందరి కళ్లూ వర్సటైల్ యాక్టర్ సూర్య వైపు మళ్లాయి. విజయ్ బాటలోనే సూర్య కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? అంటూ ఫ్యాన్స్ లో, పబ్లిక్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే, ఈ రూమర్స్‌పై తాజాగా హీరో సూర్య స్వయంగా స్పందించారు. అసలు ఆయన పాలిటిక్స్ గురించి ఏమన్నారు? ఆయన మైండ్ లో ఏముంది? స్టోరీలో చూద్దాం!
కోలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే టాపిక్.. హీరో సూర్య పాలిటిక్స్ లోకి వస్తున్నారా లేదా? ఈ సస్పెన్స్‌కు తాజాగా సూర్య తెరదించారు. చెన్నైలో జరిగిన తన లేటెస్ట్ మూవీ ‘సీన్’ సక్సెస్ మీట్లో సూర్య ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. ‘ప్రస్తుతానికి నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు లేదు’ అని చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. అయితే, ఇదే సమయంలో ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. రాజకీయాలంటే తనకు ఎలాంటి ద్వేషం లేదని, పొలిటికల్ పరిణామాలను తాను నిశితంగా గమనిస్తున్నానని పేర్కొన్నారు. ఆ రంగంపై పూర్తిస్థాయి అవగాహన, బాధ్యతల గురించి తెలుసుకోకుండా తొందరపడి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోనని సూర్య క్లారిటీ ఇచ్చారు.
నిజానికి సూర్య రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఈరోజుది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా ఆయన రన్ చేస్తున్న అగరం ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. సూర్య చేస్తున్న ఈ నిశ్శబ్ద విప్లవం, సామాజిక సేవా కార్యక్రమాలే.. ఆయన రేపు పొద్దున పాలిటిక్స్ లోకి వస్తే తిరుగుండదు అనే చర్చకు కారణమయ్యాయి. కానీ, సూర్య మాత్రం ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా సినిమాల పైనే అని హింట్ ఇచ్చేసారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సీన్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. జీతు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నజ్రియా నజీమ్, మలయాళ నటుడు నస్లెన్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. నవంబర్ 6న రిలీజైన ఈ చిత్రం, బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం కేవలం తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలోనే నెట్ వసూళ్లు రూ.62.75 కోట్లకు చేరాయంటే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి సూర్య అటు కలెక్షన్ల ‘సీన్’ లో దుమ్మురేపుతూ.. ఇటు పొలిటికల్ ‘సీన్’ పై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారన్నమాట!
చూశారుగా! సూర్య ఫ్యాన్స్‌కు ప్రస్తుతానికి రాజకీయాల కంటే ఆయన సినిమాల సక్సెసే పెద్ద పండగలా మారింది. పాలిటిక్స్ లోకి రాకపోయినా, సమాజానికి ఏం చేయాలో అది తన అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య చేస్తూనే ఉన్నారు. అందుకే ఆయన రియల్ హీరో అనిపించుకున్నారు. మరి సూర్య తీసుకున్న ఈ నిర్ణయంపై, అలాగే ‘సీన్’ సినిమా సాధిస్తున్న భారీ కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో షేర్ చేయండి.
