భారతీయ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ లేనంత భారీ బడ్జెట్‌తో, ఇంటర్నేషనల్ రేంజ్ గ్రాఫిక్స్‌తో వచ్చిన పౌరాణిక వండర్ ‘రామాయణం: పార్ట్ 1’. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, రాకింగ్ స్టార్ యష్ లాంటి క్రేజీ స్టార్స్ నటించిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.
‘రామాయణం: పార్ట్ 1’ థియేటర్లలో ఒక ఎమోషనల్ అండ్ విజువల్ మ్యాజిక్ క్రియేట్ చేసింది. వాల్మీకి రామాయణాన్ని ఇప్పటి జనరేషన్ ఆడియన్స్‌కు నచ్చేలా, సరికొత్త హంగులతో తెరకెక్కించడంలో డైరెక్టర్ నితీష్ తివారీ సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ మొదటి భాగంలో రాముడి పుట్టుక, సీతా స్వయంవరం, అరణ్యవాసం, ఆ తర్వాత సీతాపహరణం వరకు కథను చాలా హుందాగా, ఇంట్రెస్టింగ్గా చూపించారు.
రాముడి క్యారెక్టర్లో రణ్‌బీర్ చాలా ప్రశాంతంగా, డిగ్నిఫైడ్‌గా కనిపించారు. ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ పాత్రకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సీతమ్మ పాత్రలో సాయి పల్లవి జీవించేసింది. ఆమె పలికించిన హావభావాలు, ఎమోషన్స్ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. కేజీఎఫ్ తర్వాత నెగెటివ్ షేడ్ ఉన్న రావణాసురుడి క్యారెక్టర్లో యష్ స్క్రీన్‌పై రచ్చ లేపాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్సిటీ థియేటర్లలో ఫ్యాన్స్‌తో ఈలలు వేయిస్తున్నాయి.
తెలుగులో ఇదివరకు ఎన్టీఆర్ ‘లవకుశ’, బాపు ‘శ్రీరామరాజ్యం’ లాంటి ఎన్నో క్లాసిక్ రామాయణాలు వచ్చాయి. అవన్నీ నాటకీయత, పద్యాలు, భక్తిభావం చుట్టూ తిరిగితే.. ఈ ‘రామాయణం: పార్ట్ 1’ వాటికి కంప్లీట్ డిఫరెంట్‌గా హాలీవుడ్ రేంజ్ యాక్షన్, విజువల్స్, రియలిస్టిక్ డ్రామాతో వచ్చింది. తెలుగు ఆడియన్స్ ఈ సరికొత్త పౌరాణిక ప్రయోగాన్ని, ముఖ్యంగా సాయి పల్లవి యాక్టింగ్‌ను, యష్ విలనిజాన్ని బాగా ఓన్ చేసుకుంటున్నారు.
ఆస్కార్ విన్నర్ ‘DNEG’ సంస్థ అందించిన విజువల్స్ మైండ్ బ్లోయింగ్. అయోధ్య నగరం, లంక సామ్రాజ్యం గ్రాఫిక్స్ కంటికి విందులా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ క్లాసికల్ టచ్‌తో మెలోడియస్గా సాగాయి. హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మెర్‌తో కలిసి ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. అయితే, సాంగ్స్ బాగున్నప్పటికీ భక్తిరసం కంటే గ్లోబల్ మ్యూజిక్ స్టైల్ ఎక్కువైందనే టాక్ కూడా ఉంది.
ఈ సినిమా చివర్లో వచ్చే పోస్ట్ క్రెడిట్ సీన్ బాగుటుంది ఇందులో హనుమంతుడి క్యారెక్టర్లో స్టార్ హీరో సన్నీ డియోల్ ఆలా మెరుస్తారు. ఈ సీన్లో హనుమంతుడి ముఖాన్ని పూర్తిగా చూపించకుండా, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆయన ఎంట్రీని పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఇక చివర్లో ఆంజనేయుడు తన గదను పట్టుకుని ఆకాశంలోకి ఎగురుతూ ‘జై శ్రీరామ్’ అని గర్జించే షాట్‌తో ఈ క్లిప్ ముగుస్తుంది. ఈ సీన్ చూసిన ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. అంతేకాదు, సినిమా సెకండ్ పార్ట్‌పై అంచనాలను ఈ ఒక్క సీన్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిందంటూ ఆడియన్స్ అంటున్నారు.
రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ కూడా ఇండియన్ సినీ హిస్టరీలోనే టాప్ కలెక్షన్ల వైపు దూసుకుపోతున్నాయి. మొత్తానికి ‘రామాయణం పార్ట్ 1’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు.. మన సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒక అద్భుత దృశ్యకావ్యం. ఫ్యామిలీ మొత్తంతో కలిసి థియేటర్లలో ఖచ్చితంగా చూడదగ్గ మాస్టర్ పీస్.
