అహంకారానికి, ప్రజా వ్యతిరేకతకు అమెరికా గడ్డపై ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది! ప్రపంచాన్ని తన కనుసన్నల్లో శాసించాలనుకున్న డొనాల్డ్ ట్రంప్‌కు, అమెరికా మధ్యంతర ఎన్నికల రూపంలో ఒక సరికొత్త చరిత్ర షాకిచ్చింది. ఒకప్పుడు పార్టీలో ఎవరు గెలవాలన్నా, ఎవరు ఓడిపోవాలన్నా తనొక్కడే డిసైడ్ చేస్తానని విర్రవీగిన ట్రంప్ అహంకారానికి… అమెరికా ప్రజలు గట్టిగానే బుద్దిచెప్పారు. రెండేళ్ల క్రితం తిరుగులేని విజయంతో వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన ట్రంప్ పాలన… ఇప్పుడు మధ్యంతర ఎన్నికల నాటికి పూర్తిగా కుప్పకూలిపోయింది. అమెరికాలో జరిగిన మద్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు క్లీన్‌స్వీప్ చేయడంతో ట్రంప్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అసలు ట్రంప్ ఓటమికి ఆయన అహంకార ధోరణే కారణమా? ఆయన తీసుకున్న ఏ తప్పుడు నిర్ణయాలు రిపబ్లికన్ పార్టీని ఈ దుస్థితికి తెచ్చాయా అంటే అవునే సమాధానం వినిపిస్తుంది… (ట్రంప్ )
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఊహించని రీతిలో చారిత్రాత్మక ఓటమిని చవిచూసింది. సెనేట్ మరియు ప్రతినిధుల సభ రెండింటిపై పట్టును కోల్పోయి, డెమొక్రాట్ల చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇది కేవలం ఒక సాధారణ రాజకీయ ఓటమి కాదు. కన్సాస్, టెక్సస్, సౌత్ కరోలినా వంటి రిపబ్లికన్ల అడ్డాగా మారిన బలమైన రాష్ట్రాల్లో సైతం డెమొక్రాట్ అభ్యర్థులు సంచలన విజయాలు సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, తన ఓటమిని ఒప్పుకోవడానికి ఇష్టపడని ట్రంప్… ‘నేనేం బరిలో లేనుగా, ఒకవేళ ఉంటే ల్యాండ్‌స్లైడ్ విక్టరీ వచ్చేది’ అంటూ తన అహంభావపూరిత ప్రకటనలతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, అమెరికా ఓటర్లు మాత్రం ఇది ముమ్మాటికీ ట్రంప్ విధానాలపై, ఆయన నియంతృత్వ పోకడలపై ప్రజలు ఇచ్చిన తీర్పుగానే స్పష్టం చేస్తున్నారు…(స్పాట్ )
మరోపక్క అమెరికాలో మద్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి ట్రంప్ అహంకారమే కారణమంటూ రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొట్టిచెబుతున్నారు… పార్టీపై గుత్తాధిపత్యం…’నేను చెప్పిందే వేదం’ అనే ధోరణిలో ట్రంప్ వ్యవహరించి విధానం..ట్రంప్ వినాశనానికి కారమంటున్నారు..
ట్రంప్ తనను తాను పార్టీ కంటే చాలా పెద్దవాడిగా భావించారు. తనను గుడ్డిగా వ్యతిరేకించకుండా భజన చేసేవారికే టికెట్లు ఇవ్వడం, సొంత పార్టీలోనే బలమైన నాయకులను అణచివేయడం చేశారు. తనను ఎదిరించిన ఎవరినైనా రాజకీయంగా తొక్కేయాలనే ఆయన అహంకార ధోరణి పార్టీని నిలువునా చీల్చింది. ఎన్నికల ముందస్తు సర్వేలు హెచ్చరిస్తున్నా, తన ముందు ఎవరూ నిలబడలేరని ఆయన అతివిశ్వాసానికిపోయారు. దానికి తోడూ… సామాన్య ప్రజలు ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న నిత్యావసరాలు, గ్యాస్ ధరలతో అల్లాడిపోతుంటే… ట్రంప్ మాత్రం తన వ్యక్తిగత అజెండా, విదేశీ యుద్ధాలు మరియు పగటి కలల ప్రసారాలకే పరిమితమయ్యారు. ఓటర్ల సర్వేల ప్రకారం, దాదాపు 10 మందిలో 6 మంది ఓటర్లు ‘ట్రంప్ దేశ ప్రయోజనాల కంటే తన స్వార్థానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని’ బలంగా నమ్మారు. ఈ ప్రజా ఆగ్రహాన్ని ఆయన అహంకారం గుర్తించలేకపోయింది…(స్పాట్ )
కేవలం వ్యక్తిగత అహంకారమే కాకుండా, ట్రంప్ తీసుకున్న కొన్ని వివాదాస్పద మరియు తొందరపాటు నిర్ణయాలు రిపబ్లికన్ పార్టీ కొంపముంచాయి..
అమెరికా ప్రజల వ్యతిరేకతను లెక్కచేయకుండా ట్రంప్ ప్రారంభించిన సైనికచర్యలు, ఇరాన్ యుద్ధం దేశ ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేశాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా దెబ్బతిని, అమెరికాలో గ్యాస్ ధరలు అకస్మాత్తుగా భగ్గుమన్నాయి.దీంతో పాటు ట్రంప్ తెచ్చిన దూకుడు టారిఫ్ విధానాలు అమెరికాలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడానికి కారణమయ్యాయి . సామాన్యుల కిచెన్ బడ్జెట్ తలకిందులు కావడంతో, ఓటర్లు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.దీనికి తోడూ గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన యువత, హిస్పానిక్ మరియు నల్లజాతీయ ఓటర్లు ఈసారి ఆయనకు పూర్తిగా షాకిచ్చారు. ట్రంప్ దూకుడు విధానాలు, కఠిన వైఖరి నచ్చక దాదాపు 70 శాతం మంది యువకులు డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపారు…( స్పాట్ )
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు ట్రంప్ సామ్రాజ్యానికి వణికించాయి.. ఎంతటివారైనా ప్రజాస్వామ్యంలో ప్రజల ఆగ్రహాన్ని, ఓటర్ల తీర్పును తక్కువ అంచనా వేస్తే ఏ స్థాయి పతనం చవిచూడాల్సి వస్తుందో ఈ ఎన్నికలు నిరూపించాయి. తనను ఎవరూ ప్రశ్నించలేరనే ట్రంప్ అహంకారానికి, అమెరికా ఓటర్లు తమ బ్యాలెట్ ద్వారా బ్రేకులు వేశారు. ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ డెమొక్రాట్ల చేతిలోకి వెళ్లడంతో, ట్రంప్ తన ఏకపక్ష నిర్ణయాలను అమలు చేయడం దాదాపుగా అసాధ్యం కానుంది. ఈ ఓటమి నుంచి ట్రంప్ పాఠం నేర్చుకుంటారా? లేక తన అహంభావాన్ని అలాగే కొనసాగిస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.
