SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Sathupalli Bethupalli Lake Flood Sdrf Rescue Operation

జాలర్లను కాపాడబోయి వరదలో చిక్కుకున్న SDRF సిబ్బంది.. 11 మంది క్షేమం!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Thu - 5 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
 గల్లంతైన SDRF సిబ్బంది సేఫ్ ..జాలర్లను కాపాడే ప్రయత్నంలో ప్రమాదం..!

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. బేతుపల్లి పెద్ద చెరువులో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో చేపల వేటకు వెళ్లిన 8 మంది జాలర్లు చిక్కుకున్నారు. అందులో ఐదుగురిని అధికారులు సురక్షితంగా కాపాడారు. మిగిలిన ముగ్గురిని కాపాడే ప్రయత్నంలో 11 మంది SDRF సిబ్బంది ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. అయితే అందులో ఐదుగురు SDRF సిబ్బంది నిన్న సురక్షితంగా బయటపడగా..మరో ఆరుగురు కూడా క్షేమంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు.

కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహిస్తూ అలుగు పారుతోంది. ఈ క్రమంలో, చెరువులోని చేపలు బయటకు కొట్టుకుపోకుండా అడ్డుకునేందుకు వలలు వేసేందుకు ఐదుగురు జాలర్లు చెరువులోకి వెళ్లారు. అయితే నీటి ఉధృతి ఒక్కసారిగా తీవ్రం కావడంతో వారు వరద ప్రవాహం మధ్యలో చిక్కుకుపోయారు. వారిని కాపాడటానికి తెప్పలపై వెళ్లిన మరికొందరితో కలిపి మొత్తం ఎనిమిది మంది నీటిలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక బృందం వెంటనే స్పందించి పడవలపై వెళ్లి ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. మిగిలిన ఐదుగురు మత్స్యకారులు చెరువు మధ్యలోనే ఓ మట్టి దిబ్బపై ఉండిపోయారు.

మట్టిదిబ్బపై చిక్కుకున్న ఆ ఐదుగురు మత్స్యకారులను రక్షించేందుకు రాత్రి 7.30 గంటల సమయంలో ఒక భారీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. కొత్తగూడెం బెటాలియన్‌కు చెందిన ఆరుగురు పోలీసులు, నలుగురు అగ్నిమాపక సిబ్బందితో కూడిన 10 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ టీం.. ఒక స్థానికుడిని వెంటబెట్టుకుని రెండు సేఫ్టీ బోట్లలో చెరువులోకి బయలుదేరింది. కానీ దురదృష్టవశాత్తూ, చెరువు అలుగు పారుతున్న చోట వరద ఉధృతి ఊహించని విధంగా ఉండటంతో ఆ రెండు బోట్లు ఒక్కసారిగా తిరగబడ్డాయి. దీంతో పడవల్లో ఉన్న 11 మందీ ఆ చీకట్లో ఉధృతమైన వరద నీటిలోకి కొట్టుకుపోయారు. ఆపన్నులను రక్షించాల్సిన దళమే ప్రమాదంలో పడటంతో ఒక్కసారిగా జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది.రంగంలోకి దిగిన విజయవాడ ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం.. ఆ మట్టిదిబ్బ వద్దకు చేరుకుని, ఐదుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చింది. మత్స్యకారులు ప్రాణాలతో బయటపడినప్పటికీ.. వారిని రక్షించడానికి వెళ్లిన సిబ్బంది ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది.

Join Our Whatsapp Channel

రాత్రి ప్రతికూల వాతావరణం, దట్టమైన చీకటి ఉన్నప్పటికీ కలెక్టర్ దివాకర టీఎస్, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. వరదలో కొట్టుకుపోయిన సిబ్బందిలో కొందరు తమతో ఫోన్‌లో మాట్లాడారని జిల్లా అగ్నిమాపక అధికారి అజయ్ కుమార్ తెలిపారు. ఆ కమ్యూనికేషన్ ఆధారంగా రాత్రి 2.15 గంటలకు ఒకరిని, తెల్లవారుజామున 3.00 గంటల ప్రాంతంలో మరో నలుగురిని.. మొత్తం ఐదుగురు సిబ్బందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. మరో ఆరుగురు సిబ్బంది కూడా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.

Tags :

  • Bethupalli Lake
  • Flood Rescue
  • Khammam News
  • Sathupalli News
  • SDRF Rescue Operation
  • Telangana Heavy Rains
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • జాలర్లను కాపాడబోయి వరదలో చిక్కుకున్న SDRF సిబ్బంది.. 11 మంది క్షేమం!

  • రాప్తాడు బాలికకు ఊరట.. ఆర్థోపెడిక్ సర్జరీ సక్సెస్.. లోకేశ్ కీలక ప్రకటన!

  • పులివెందులలో పొలిటికల్ టెన్షన్.. టీడీపీ vs వైసీపీ.. రాళ్ల దాడులతో ఉద్రిక్తత!

  • రామ్ చరణ్ – సుకుమార్ RC 17.. కథలో ఇన్ని ట్విస్టులా? ప్రీ లుక్‌తో పెరిగిన అంచనాలు!

  • కింగ్ 100లో మహంతి ఝాన్సీ రాణిగా టబు.. నాగార్జునతో హైఓల్టేజ్ మైండ్ గేమ్!

  • బాక్సాఫీస్ వద్ద రామాయణం రికార్డుల వేట.. విడుదలకు ముందే రూ.100 కోట్లు!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో 4 రోజులు భారీ వర్షాలు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam