టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ మూవీగా తెరకెక్కుతున్న *వందో చిత్రం ‘కింగ్ 100’*పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డైరెక్టర్ రా.కార్తీక్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ వెటరన్ బ్యూటీ టబు ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టబు క్యారెక్టర్‌కు సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఆ గ్లింప్స్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. స్క్రీన్ మీద అత్యంత పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్ అవతారంలో, రాయల్ లుక్‌తో మన టబు ఎంట్రీ ఇస్తుంది. జనం, భారీ సెక్యూరిటీ మధ్య ఆమె నడుచుకుంటూ వస్తుంటే అచ్చం ఒక లేడీ కింగ్‌లా ఆ రేంజ్ కనిపిస్తోంది. ఆ ఝాన్సీ రాణి మైక్ ముందుకు వచ్చి గంభీరమైన స్వరంతో.. “ఈ ప్రపంచంలో మనుషులు రెండు రకాలు.. ఒకరు కష్టాన్ని నమ్మేవాళ్ళు, ఇంకొకరు అదృష్టాన్ని నమ్మేవాళ్ళు. ఐ హేట్ లక్! మహంతి ఝాన్సీ రాణి అనే నేను…” అంటూ ప్రమాణ స్వీకారం చేస్తూ తన అసలైన పవర్ చూపిస్తుంది.
కట్ చేస్తే.. ఒకప్పుడు వెండితెరపై మ్యాజిక్ చేసిన వీరిద్దరి లవ్ కెమిస్ట్రీ.. ఇప్పుడు ఒక 50,000 కోట్ల భారీ ఫైనాన్షియల్ స్కామ్ నేపథ్యంలో వచ్చే మైండ్ గేమ్స్, మైండ్ బ్లోయింగ్ వార్‌గా మారబోతోంది! ఒకవైపు కేవలం కష్టాన్నే నమ్ముకుంటూ, అదృష్టం అనే మాటను అసహ్యించుకునే పొలిటికల్ పవర్ హౌస్ ఝాన్సీ రాణి.. ఇంకోవైపు అట్టడుగు స్థాయి నుంచి స్వయంకృషితో ఎదిగి, తన ఐడెంటిటీ కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే కింగ్ నాగార్జున!
నాగ్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేయాలని టబు వ్యూహాలు రచిస్తుంటే, కింగ్ తనదైన మాస్ అండ్ క్లాస్ గేమ్‌తో వాటిని ఎలా తిప్పికొట్టాడు అనేదే ఇక్కడ అసలైన మైండ్ గేమ్. 30 ఏళ్ల క్రితం ఒక క్లాసిక్ లవ్ స్టోరీతో అలరించిన ఈ జంట, ఈసారి పాత లెక్కలన్నింటినీ సరిచేస్తూ సరికొత్త హై-వోల్టేజ్ రివెంజ్ డ్రామాతో ఆడియన్స్‌కు సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, గ్రాండ్‌గా నిర్మిస్తున్న నాగార్జున 100వ మైల్‌స్టోన్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24,2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. ఈ డిసెంబర్‌లో థియేటర్లలో కింగ్ అండ్ లేడీ కింగ్ మధ్య జరిగే ఈ బాక్సాఫీస్ వార్ పక్కా పైసా వసూల్ ఎంటర్‌టైనర్ అవ్వడం ఖాయం!
Happy Birthday #Tabu ❤️
An unmatched screen presence. An intensity that commands every frame 🔥
Presenting #Tabu as ‘MAHANTHI JHANSI RANI’ from #King100 ❤🔥
▶️https://t.co/KmaLTc61JY#HappyBirthdayTabu
𝐈𝐍 𝐂𝐈𝐍𝐄𝐌𝐀𝐒 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟐𝟒𝐭𝐡, 𝟐𝟎𝟐𝟔.
King @iamnagarjuna @ThisIsDSP
@AshokSelvan @Rakarthik_dir @aishu_dil
@sush_bhat94 @rajamahadhevan @NavinNooli @ArtSathees
@CVRao74 @lemonsprasad
#SupriyaYarlagadda @editorNash @TSeriesSouth @AnnapurnaStdios— Annapurna Studios (@AnnapurnaStdios) November 4, 2026
