SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Ap Heavy Rain Alert Next Four Days Chandrababu Orders

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో 4 రోజులు భారీ వర్షాలు!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 4 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మురసు తుఫాన్ ప్రభావం.. 4 రోజులు భారీ వర్షాలు

మురసు తుఫాను ఎఫెక్ట్ తో ఏపీలో మరోసారి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కుండబోత వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ తీవ్రతను గమనించిన సీఎం చంద్రబాబు బాధిత జిల్లాల ప్రజలకు తక్షణ సాయం అందించేలా, ప్రాణ ఆస్తి నష్టాలను అరికట్టేలా అధికారులను ఆరా తీస్తున్నారు. జిల్లాల వారీగా కురిసిన వర్షపాతం, గాలుల తీవ్రత, గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై సీఎం వివరంగా తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే రానున్న మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురస్తాయని అధికారులు తెలిపారు.

ముఖ్యంగా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 20.38 సెంటీమీటర్ల మేర అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు సీఎంకు నివేదించారు. గ్రామాలు, నగరాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అక్కడి ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆహారం, మంచినీరు అందించాలని సీఎం ఆదేశించారు.

ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ, రాష్ట్రంలో వేధిస్తున్న తీవ్ర వర్షపాతం లోటు భారీగా తగ్గిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గతంలో 53 శాతంగా ఉన్న వానలోటు ఈ ఒక్క వర్షానికే ఏకంగా 28 శాతానికి తగ్గిపోయిందని ఆయన తెలిపారు. అయితే సంబరపడే లోపే.. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో వీస్తున్న గాలుల ప్రభావం తగ్గకపోవడంతో ఏ క్షణమైనా ఎదురయ్యే ఎలాంటి అత్యవసర పరిస్థితులకైనా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సీఎం హెచ్చరించారు.

Join Our Whatsapp Channel

వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విపత్తు నిర్వహణ బృందాలతో సీఎం చంద్రబాబు నిరంతరం టెలికాన్ఫరెన్స్ జరుపుతున్నారు. ప్రతి జిల్లాలోనూ 24/7 కంట్రోల్ రూమ్‌లను అందుబాటులో ఉంచాలని, డ్రైనేజీలు, వాగులు పొంగిపొర్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారులపై విరిగిపడిన చెట్లను తొలగించి రవాణా, విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలన్నారు. అలాగే రైతుల పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి తగిన పరిహారం అందించి ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

తుఫాన్ తీవ్రత తగ్గే వరకు కృష్ణా, గోదావరి, ప్రకాశం, తీర ప్రాంత ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలువలు, పాత భవనాలు, కరెంట్ స్తంభాల వద్దకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags :

  • Andhra Pradesh News
  • AP Weather
  • Chandrababu Naidu
  • heavy rains
  • Murusu Cyclone
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

    పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

    జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

    ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • దసరాకి పార్టీ జెండా, ఎజెండా సిద్దం.. విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన

    దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో 4 రోజులు భారీ వర్షాలు!

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో 4 రోజులు భారీ వర్షాలు!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam