SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Baira Dileep Chakravarthy Joins Janasena

జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Thu - 15 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీలోకి మరో ప్రముఖ వ్యక్తి చేరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్ అధినేత బైరా దిలీప్ చక్రవర్తి జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన బైరా దిలీప్ చక్రవర్తికి రాజకీయాలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మొదటి నుంచి మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న ఆయన, గతంలో కొంతకాలం జనసేన పార్టీతోనూ కలిసి పనిచేశారు. అనంతరం తన వ్యాపార కార్యకలాపాలపై దృష్టి సారించారు.

తాజాగా మరోసారి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న దిలీప్ చక్రవర్తి, జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా తాను రచించిన ‘లైఫ్ హ్యాక్స్’ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బైరా దిలీప్ చక్రవర్తి చేరికతో పల్నాడు జిల్లా రాజకీయాల్లో జనసేన పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గతంలో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన అనుభవం, నరసరావుపేట ప్రాంతంతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆయనకు పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది చూడాలి

జనసేన పార్టీలోకి శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి

Join Our Whatsapp Channel

ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్ అధినేత శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి బుధవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకు ఉపముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి ప్రజారాజ్యం పార్టీ తరఫున గతంలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మొదటి నుంచి మెగా కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన ఆయన జనసేన పార్టీతోనూ కొన్ని రోజులు ప్రయాణం చేసిన అనంతరం వ్యాపార కార్యకలాపాల్లో బిజీ అయ్యారు. మళ్లీ రాజకీయంగా చురుగ్గా జనసేన పార్టీలోనే తన కార్యకలాపాలను కొనసాగించాలని నిశ్చయించుకొని బుధవారం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా శ్రీ దిలీప్ చక్రవర్తి తాను రచించిన “Life Hacks” పుస్తకాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. అనంతరం శ్రీ దిలీప్ చక్రవర్తితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

— JanaSena Party (@JanaSenaParty) October 14, 2026

Tags :

  • Andhra Pradesh News
  • జనసేన పార్టీలో చేరిక
  • జనసేన వార్తలు
  • పల్నాడు రాజకీయాలు
  • పవన్ కళ్యాణ్
  • బైరా దిలీప్ చక్రవర్తి
  • బైరా ఫౌండేషన్
  • సత్తెనపల్లి రాజకీయాలు
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • దసరాకి పార్టీ జెండా, ఎజెండా సిద్దం.. విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన

    దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

    తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రాజ్ భవన్ మార్చ్‌ వేళ తీవ్ర ఉద్రిక్తత.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్

    రాజ్ భవన్ మార్చ్ వేళ ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

  • దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన ఉద్యోగిని.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

    దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam