ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీలోకి మరో ప్రముఖ వ్యక్తి చేరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్ అధినేత బైరా దిలీప్ చక్రవర్తి జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన బైరా దిలీప్ చక్రవర్తికి రాజకీయాలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున సత్తెనపల్లి అసెంబ్లీ […]