SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Meerut Blue Drum Murder Case Muskan Sahil Death Sentence

ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 14 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్‌ బ్లూ డ్రమ్‌ హత్య కేసులో బుధవారం తుది తీర్పు వెలువడింది. మెర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ హత్య కేసులో ఆయన భార్య ముస్కాన్‌ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్‌ శుక్లాలను మీరట్‌ జిల్లా, సెషన్స్‌ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇక నేడు వీరిన మ‌ర‌ణ శిక్ష విధిస్తూ మీరట్‌ జిల్లా తుది తీర్పును వెల్ల‌డించింది. 2025 మార్చిలో వెలుగులోకి వచ్చిన ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సౌరభ్‌కు మత్తుమందు ఇచ్చి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ఇంట్లోని బ్లూ ప్లాస్టిక్‌ డ్రమ్‌లో దాచిపెట్టారు. హత్య విషయం బయటపడకుండా డ్రమ్‌లో సిమెంట్‌ పోసి మూసివేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో హత్యతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేయడం, దాచిపెట్టడం వంటి నేరాల్లోనూ ముస్కాన్‌, సాహిల్‌ దోషులుగా తేలారు. ఈ కేసు దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా న్యాయస్థానంలో విచారణ కొనసాగింది.ఈ కేసులో సుమారు 16 నెలల పాటు విచారణ సాగింది. మొత్తం 126 సార్లు విచారణ చేపట్టగా, ప్రాసిక్యూషన్‌ తరఫున 22 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిశీలించింది. నిందితులపై పోలీసులు సుమారు వెయ్యి పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఫోరెన్సిక్‌ నివేదికలు, కాల్‌ డేటా రికార్డులు, సీసీటీవీ దృశ్యాలు సహా పలు ఆధారాలను దర్యాప్తులో భాగంగా సేకరించారు.

మార్చి 2025లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో వెలుగుచూసిన ఈ ఘటన, తాజాగా అక్టోబర్ 14, 2026న కోర్టు విధించిన మరణశిక్ష తీర్పుతో ముగిసింది. నమ్మిన భార్యే ప్రియుడితో కలిసి భర్తను ఎంత కిరాతకంగా చంపింది. మర్చంట్ నేవీలో పనిచేసే సౌరభ్ రాజ్‌పుత్ అనే యువకుడికి ముస్కాన్ రస్తోగితో వివాహమైంది. భర్త ఉద్యోగరీత్యా ఎక్కువ రోజులు షిప్‌లపై సముద్ర ప్రయాణాల్లో ఉండేవాడు. ఇదే సమయంలో ముస్కాన్‌కు సాహిల్ శుక్లా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. సౌరభ్ ఇంట్లో లేని సమయాల్లో వీరిద్దరూ తరచూ కలుసుకునేవారు. అయితే, తమ బంధానికి సౌరభ్ అడ్డుగా ఉన్నాడని భావించిన ముస్కాన్, సాహిల్.. అతడిని శాశ్వతంగా పక్కన పెట్టాలని ఒక నరరూప రాక్షస ప్లాన్ వేశారు.

సౌరభ్ సెలవులపై ఇంటికి వచ్చిన ఒక రాత్రి, ముస్కాన్ పక్కా ప్లాన్ ప్రకారం అతడి ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. సౌరభ్ గాఢ నిద్రలోకి జారుకున్నాక.. ముస్కాన్ తన ప్రియుడు సాహిల్‌ను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి నిద్రపోతున్న సౌరభ్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చారు. హత్య చేసిన తర్వాత శవాన్ని ఎలా మాయం చేయాలో వారు ముందే ప్లాన్ చేసుకున్నారు. ఒక నీలి రంగు ప్లాస్టిక్ డ్రమ్ తెచ్చి, సౌరభ్ మృతదేహాన్ని అందులో తొక్కేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా, కుళ్ళిన వాసన బయటకు రాకుండా ఉండేందుకు ఆ డ్రమ్‌ను పూర్తిగా సిమెంట్‌తో నింపి సీల్ చేశారు. ఆ డ్రమ్‌ను నిర్మానుష్య ప్రాంతంలో పడేసి, ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడటం ప్రారంభించారు.

Join Our Whatsapp Channel

సౌరభ్ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముస్కాన్ ప్రవర్తనపై అనుమానంతో ఆమె కాల్ డేటాను పరిశీలించగా సాహిల్‌తో ఉన్న సంబంధం బయటపడింది. గట్టిగా విచారించడంతో ఇద్దరూ చేసిన పాపాన్ని ఒప్పుకున్నారు. వారు చూపించిన ప్రదేశం నుండి సిమెంట్‌తో సీల్ చేసిన బ్లూ డ్రమ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, తెరిచి చూడగా కుళ్ళిపోయిన సౌరభ్ శవం లభ్యమైంది. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ కేసు మీరట్ జిల్లా కోర్టులో దాదాపు ఏడాదిన్నర పాటు సాగింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు పక్కా ఆధారాలను కోర్టు ముందుంచారు. మొత్తం 126 సార్లు కోర్టు విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఇది “అరుదైన వాటిల్లో అత్యంత అరుదైన కేసు” గా పరిగణించింది. నమ్మిన భర్తను దారుణంగా చంపిన భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా ఇద్దరినీ దోషులుగా తేలుస్తూ.. కోర్టు వారికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో బాధితుడి కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం జరిగింది.

Tags :

  • Blue Drum Case Telugu
  • Meerut Blue Drum Murder Case
  • Meerut Court Verdict
  • Muskan Rastogi Death Sentence
  • Sahil Shukla Death Penalty
  • Saurabh Rajput Murder Case
  • SumanTV Telugu News
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam