SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Ap Local Body Elections Code Of Conduct Rules

ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 14 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

ఏపీలో స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదలైన నిమిషం నుంచే.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో నుంచి పట్టణం దాకా అంతా ఎన్నికల సంఘం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. మరి ఈ కోడ్ అమల్లో ఉన్నంత కాలం ఎలాంటి ఆంక్షలు ఉంటాయి? ఎవరెవరికి షరతులు వర్తిస్తాయి? రూల్స్ బ్రేక్ చేస్తే ఎలాంటి యాక్షన్ ఉంటుంది? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నేటి నుంచి ప్రభుత్వ ప్రాధాన్యతలకు బ్రేక్ పడినట్లే. ఓటర్లను ఆకర్షించేలా ఎలాంటి కొత్త పథకాలు, ఉచితాలు ప్రకటించడానికి వీల్లేదు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తిగా నిషిద్ధం. అంతేకాదు, సీఎం నుంచి మంత్రుల వరకు ఎవరూ కూడా ప్రభుత్వ వాహనాలు, అధికారిక భవనాలను ఎన్నికల ప్రచారం కోసం వాడటానికి వీల్లేదు. ఒకవేళ వాడితే అది కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది. రాజకీయ నాయకులు ఇష్టమొచ్చినట్లు సభలు, రోడ్ షోలు పెడతామంటే ఇకపై కుదరదు. ఎక్కడ మీటింగ్ పెట్టాలన్నా స్థానిక పోలీసుల నుంచి ముందస్తుగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవాల్సిందే. ఇక మైకుల మోతపై కూడా ఆంక్షలు ఉన్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్లు వాడటం పూర్తిగా నిషేధించనున్నారు. ప్రచారంలో కుల, మతాల ప్రస్తావన తెచ్చినా, ప్రార్థనా స్థలాలను వాడుకున్నా ఈసీ కఠిన చర్యలు తీసుకోనుంది.

నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెరుగుతుంది. ముఖ్యంగా పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి, అలాగే కౌంటింగ్ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తారు. దీని ప్రకారం పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం చట్టవిరుద్ధం. ఇక లైసెన్స్ ఉన్న ఆయుధాలను సైతం వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, నిఘా బృందాలు రంగంలోకి దిగాయి. సరైన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు పైగా నగదు లేదా బహుమతులు రవాణా చేస్తే అక్కడికక్కడే సీజ్ చేస్తారు. ఓటర్లకు డబ్బు, మద్యం పంచాలని చూస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అంతేకాకుండా, సదరు అభ్యర్థిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు కూడా వేసే అవకాశం ఉంది.

ఈ ఎన్నికల కోడ్ కేవలం రాజకీయ నేతలకే కాదు, సామాన్య ప్రజలకు, అధికారులకు కూడా సమానంగా వర్తిస్తుంది. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి పల్లెల్లోని సచివాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇకపై ఈసీ ఆదేశాల మేరకే విధులు నిర్వహించాల్సి ఉంటుంది, ఎక్కడా అధికార పార్టీకి కొమ్ముకాయడానికి వీల్లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలపై ఎలాంటి రాజకీయ నాయకుల చిత్రాలు, ప్రభుత్వ పథకాల వాల్ పోస్టర్లు ఉండటానికి వీల్లేదు.ప్రైవేట్ వ్యక్తుల కాంపౌండ్ వాల్స్ లేదా ఇళ్ళపై ప్రచారం చేయాలన్నా సదరు యజమాని నుంచి ముందస్తు అనుమతి పత్రం తప్పనిసరి. అనుమతి లేకుండా ఎక్కడైనా ఫ్లెక్సీలు, బ్యానర్లు కడితే మున్సిపల్ సిబ్బంది వాటిని వెంటనే తొలగించి, సదరు అభ్యర్థి ఖర్చుల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తారు.

Join Our Whatsapp Channel

అభ్యర్థులకు అనుకూలంగా పత్రికలు లేదా టీవీ ఛానళ్లలో వచ్చే వార్తలు పై ఈసీ ప్రత్యేక నిఘా ఉంచింది. సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై తప్పుడు ప్రచారాలు చేసినా, మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేసినా ఐటీ యాక్ట్ కింద నాన్-బైలబుల్ కేసులు నమోదవుతాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు సరిహద్దుల వద్ద ఇప్పటికే అంతరాష్ట్ర పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఎన్నికల వేళ ఇతర ప్రాంతాల నుంచి అక్రమ మద్యం, నగదు ఏపీలోకి రాకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. నియోజకవర్గాల్లోని ప్రధాన బ్యాంకుల నుంచి జరిగే భారీ నగదు విత్‌డ్రాల్స్ మరియు అనుమానాస్పద ఆన్‌లైన్ బదిలీలపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. ఒకే అకౌంట్ నుంచి వందలాది మందికి డిజిటల్ పేమెంట్స్ జరిగితే సదరు అకౌంట్లను వెంటనే సీజ్ చేస్తారు. ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థుల ప్రచార శైలిని, వారు పెట్టే ఖర్చులను అంచనా వేసేందుకు ప్రత్యేక ‘వీడియో సర్వైలెన్స్ టీమ్స్’ రంగంలోకి దిగాయి.

అభ్యర్థి ర్యాలీలో వాడే కార్లు, పంచే భోజనాలు, పిలిపించే జనాల సంఖ్య అంతా వీడియో రికార్డ్ చేసి వారి ఎన్నికల వ్యయ ఖాతాలో లెక్కిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అత్యంత ఉత్కంఠభరితమైన నిబంధన ఏమిటంటే, పోలింగ్ ముగిసిన వెంటనే ఆయా గ్రామాల్లోనే కౌంటింగ్ జరుగుతుంది. బ్యాలెట్ బాక్సులను ఎక్కడికో తరలించకుండా, స్థానిక పోలింగ్ కేంద్రంలోనే ఓట్లు లెక్కించి అదే రోజు రాత్రికి విజేతలను ప్రకటిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీ తరపున ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రచారంలో పాల్గొనకూడదు. కోడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే సదరు ఉద్యోగిపై తక్షణమే సస్పెన్షన్ వేటు పడటంతో పాటు శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయి. చూశారుగా.. ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల పోరును పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇటు అధికార కూటమి, అటు విపక్షం కూడా ఈ నిబంధనల నడుమే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

Tags :

  • Andhra Pradesh Elections
  • AP Election Code Rules
  • AP Election Commission
  • AP Local Body Elections 2026
  • Election Model Code of Conduct
  • ఏపీ ఎన్నికల కోడ్
  • స్థానిక సంస్థల ఎన్నికలు
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • అనుకున్న టైమ్‌కే లోకల్ ఎలక్షన్స్..ఫేక్ న్యూస్‌పై SEC క్లారిటీ

    అనుకున్న టైమ్‌కే లోకల్ ఎలక్షన్స్.. ఫేక్ న్యూస్‌పై SEC క్లారిటీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

  • ఫ్యూచర్ లో ఉండేవి ఈ మూడు ఉద్యోగాలే.. అసలు నిజం చెప్పిన AI ఎక్స్ పర్ట్

  • ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • శ్రీదేవి పోరాటం గెలిచింది.. ప్రియుడితో పెళ్లి జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam