వాహనదారులకు బిగ్ అలర్ట్ రేపే డెడ్‌లైన్..
నంబర్ ప్లేట్ ఉంటేనే RC కార్డు..
మారిన కొత్త పొల్యూషన్ రూల్స్ ఇవే..
ఇకపై 3 నెలలకోసారి PUC తప్పనిసరి..
డీలర్లకు రవాణా శాఖ స్ట్రిక్ట్ వార్నింగ్..
2019 ముందు బండ్లకు కొత్త రూల్స్..
రేపటిలోపు చేయకపోతే భారీ జరిమానా..
మీరు బైక్ లేదా కారు వాడుతున్నారా? ముఖ్యంగా మీ దగ్గర పాత వాహనం ఉందా? అయితే ఈ వార్త మీకోసమే! తెలంగాణ రవాణా శాఖ వాహనదారులకు, డీలర్లకు ఒక బిగ్ అలర్ట్ జారీ చేసింది. నిర్లక్ష్యం చేస్తే మీ బండికి ఇబ్బందులు తప్పవు. డెడ్‌లైన్ ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది! అసలు ఆ మారిన రూల్స్ ఏంటి? లాస్ట్ డేట్ ఎప్పుడు? ఈ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి?
పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చడం తప్పనిసరి చేస్తూ తెలంగాణ రవాణా శాఖ తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. 1989 మోటారు వాహనాల చట్టంలోని రూల్ 50 ప్రకారం, ప్రతి పాత వాహనానికి కూడా ఈ హై-సెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు, HSRP నంబర్ ప్లేట్ అమర్చి, ఆ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తేనే వాహనాల RC కార్డు ప్రింటింగ్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల చాలామందికి ఆర్సీ కార్డులు రాక ఇబ్బంది పడుతున్నారు.
రవాణా శాఖ లెక్కల ప్రకారం, తెలంగాణలో ఇప్పటివరకు 6,10,330 వాహనాలు వాహన్ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యాయి. ఇందులో 4,56,298 వాహనాలకు HSRP ప్లేట్లు అమర్చారు. ఇంకా 1,54,032 వాహనాలకు ప్లేట్లు వేయడం పెండింగ్‌లో ఉంది. ఈ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని నవంబర్ 21న రవాణా శాఖ డీలర్లకు 7 రోజుల డెడ్‌లైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ నవంబర్ 27 కావడంతో, ఆ గడువు ముగియడానికి సరిగ్గా నవంబర్ 28 వరకు అంటే కేవలం ఒకే ఒక్క రోజు ఉంది నవంబర్ నెలాఖరు లోపు మాత్రమే సమయం మిగిలి ఉంది! గడువు లోపు ప్లేట్లు అమర్చని డీలర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు, వారి ట్రేడ్ సర్టిఫికెట్లను సస్పెండ్ చేస్తామని, వాహన్ పోర్టల్ లాగిన్‌లను బ్లాక్ చేస్తామని రవాణా శాఖ హెచ్చరించింది.
పాత వాహనదారులకు అంటే 2019 ఏప్రిల్ కంటే ముందు కొన్న పాత బైకులు, కార్లు, ఆటోలకు ఇంకా HSRP నంబర్ ప్లేట్లు లేకపోతే వెంటనే వేయించుకోవాలి. ఒకవేళ మీరు కొత్త బండి కొని లేదా పాత బండికి ప్లేట్ కోసం బుక్ చేసి, ఇంకా నంబర్ ప్లేట్ గానీ, RC కార్డు గానీ రాకపోతే వెంటనే మీ డీలర్‌ను లేదా దగ్గరలోని ఆర్టీఏ ఆఫీసును సంప్రదించాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయి, పెండింగ్‌లో ఉన్న 1.54 లక్షల వాహనాలకు యుద్ధప్రాతిపదికన ప్లేట్లు అమర్చి, ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా డీలర్లదే.
కేవలం నంబర్ ప్లేట్లే కాదు, కేంద్ర ప్రభుత్వం తాజాగా పొల్యూషన్ సర్టిఫికెట్ నిబంధనల్లోనూ కీలక మార్పులు తీసుకొచ్చింది.
వాహనం వయసు, ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి ఈ రూల్స్ మారాయి పాత వాహనాలకు పాత ఇంజిన్లు (BS-1, BS-2, BS-3) ఉన్న వాహనాలకు ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి కచ్చితంగా పొల్యూషన్ చెక్ చేయించి PUC సర్టిఫికెట్ తీసుకోవాలి. BS-4 వాహనాలకు వీటికి ప్రతి 6 నెలలకు ఒకసారి PUC తీసుకోవాలి. ఆరేళ్ల లోపు వయసున్న కొత్త BS-6 ప్రైవేట్ వాహనాలకు ఒకసారి పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకుంటే ఏకంగా 3 ఏళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.
మరి మీ వాహనానికి ఇంకా HSRP నంబర్ ప్లేట్ లేకపోయినా, డీలర్ దగ్గర పెండింగ్‌లో ఉన్నా వెంటనే అలర్ట్ అవ్వండి. అలాగే మీ బండి పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు ఎప్పటి వరకు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు పడటంతో పాటు ఆర్టీఏ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే జాగ్రత్త పడండి!
