బంగారం కొనాలనుకునే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు పసిడి ధరలు మరోసారి చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాల ఎఫెక్ట్ దేశీయ బులియన్ మార్కెట్‌పై గట్టిగా పడింది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో జనం బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయి? 22 క్యారెట్లు, 24 క్యారెట్ల మధ్య ధరల తేడా ఎంత?
బులియన్ మార్కెట్ తాజా రిటైల్ ధరల జాబితా ప్రకారం, నేడు హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా లక్షా 28 వేల 410 రూపాయలుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,410గా కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,17,710గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,560కు విక్రయిస్తుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,17,860కు లభిస్తోంది. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,28,410 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,710గా ట్రేడవుతోంది.బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,410గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,17,710 వద్ద ట్రేడవుతోంది.
అయితే బంగారం కొనుగోలు చేసేటప్పుడు చాలామందికి 22 క్యారెట్లు, 24 క్యారెట్ల మధ్య ఉన్న అసలు వ్యత్యాసం ఏంటో తెలియదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ రెండు రకాల బంగారం మధ్య 10 గ్రాములకు సరిగ్గా 10 వేల 700 రూపాయల తేడా కనిపిస్తోంది. 24 క్యారెట్ల బంగారాన్ని అత్యంత స్వచ్ఛమైన పసిడిగా పరిగణిస్తారు, కానీ ఇది చాలా మృదువుగా ఉండటం వల్ల డైరెక్ట్‌గా ఆభరణాల తయారీకి పనికిరాదు. అందుకే దీనిని కేవలం గోల్డ్ బిస్కెట్లు, కాయిన్స్ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్ కోసం మాత్రమే వాడుతారు. మరోవైపు, మనం రోజువారీగా ధరించే గొలుసులు, గాజులు, ఉంగరాల తయారీలో 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. దీనినే 916 హాల్‌మార్క్ గోల్డ్ అని పిలుస్తారు, ఇందులో 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది.
మార్కెట్‌లో ప్రకటించే రిటైల్ రేట్లను చూసి షాపుకు వెళ్లే కస్టమర్లకు అక్కడ తుది బిల్లు చూశాక అసలు షాక్ తగులుతుంది. ఎందుకంటే, పేపర్లలో లేదా న్యూస్‌లో కనిపించే ధరలు కేవలం ప్రాథమిక రిటైల్ రేట్లు మాత్రమే. మీరు ఒక తులం 22 క్యారెట్ల బంగారు ఆభరణం కొనాలనుకుంటే, బేసిక్ రేటు లక్షా 17 వేల 710 రూపాయలతో పాటు తయారీ ఛార్జీలు అంటే మేకింగ్ ఛార్జెస్, తరుగు పేరుతో వసూలు చేసే వేస్టేజ్, వీటన్నింటికీ తోడు 3 శాతం జీఎస్టీ అదనంగా కలుస్తాయి. మీరు ఎంచుకునే నగల డిజైన్, నగిషీ పనితనం, అలాగే షోరూమ్‌ను బట్టి ఈ అదనపు ఖర్చులు మారుతూ ఉంటాయి. కాబట్టి బేసిక్ రేటు కంటే తుది బిల్లు కొన్ని వేల రూపాయలు ఎక్కువే ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం ధరలు ఇప్పట్లో భారీగా తగ్గే సూచనలు కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల రాబోయే రోజుల్లో పసిడి రేట్లు మరింత పెరిగే అవకాశమే ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి ఇళ్లలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నవారు ఒకేసారి కాకుండా, ధర కాస్త తగ్గినప్పుడల్లా కొద్దికొద్దిగా కొనుగోలు చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. అలాగే నగలు కొనే ముందు కచ్చితంగా 916 హాల్‌మార్క్ గుర్తును, హెచ్‌యూఐడీ నంబర్‌ను చెక్ చేసుకోవడం మర్చిపోవద్దని నిపుణులు తెలియజేస్తున్నారు.
