SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Festival Effect Essential Commodities Prices Telangana

పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • Written By: Ayyappa Panja
  • Published Date - Thu - 15 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

పండుగ వచ్చింది అంటే ఇళ్లలో వెలుగులు, ముఖాల్లో నవ్వులు వెలిగిపోవాలి. కానీ, ఈ దసరా, బతుకమ్మ పండుగల వేళ నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడి జేబుకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. కేవలం ఒకే ఒక్క నెలలో కిలో బియ్యం ధర ఏకంగా 30 రూపాలయలు పెరగడంతో సామాన్య ప్రజలు షాక్ గురవుతున్నారు. అసలు పండుగ వేళ వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్న ఆ ధరల వివరాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న ఎల్‌నినో ప్రభావమే. వర్షాలు సరిగా కురవక జలాశయాల్లో నీరు అడుగంటిపోవడంతో నీటి లభ్యత లేక వరి దిగుబడి బాగా తగ్గిపోయింది. దీని ప్రభావం మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. గత నెలలో హోల్‌సేల్‌లో కిలో రూ. 65 ఉన్న హెచ్‌ఎంటీ జైశ్రీరాం బియ్యం ధర ఏకంగా రూ. 95కి చేరగా, కిలో రూ. 45 ఉన్న సోనామసూరి బియ్యం రూ. 70 పలుకుతోంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకారం తెలంగాణలో బియ్యం రిటైల్ ధరలు 13.3 శాతం పెరిగాయి.

కేవలం బియ్యం మాత్రమే కాదు, వంటగదిలో రోజూ వాడే పప్పుల ధరలు కూడా విపరీతంగా ఎగబాకుతున్నాయి. సెప్టెంబరులో హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో శనగపప్పు ధర రూ. 76 ఉంటే, ఇప్పుడు రూ. 96కి పెరిగింది. అలాగే రూ. 96 ఉన్న పెసరపప్పు రూ. 110కి చేరింది. కందిపప్పు, చక్కెర, ధనియాలు, జీలకర్రతో పాటు సోప్‌లు, డిటర్జెంట్ల ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. సరుకుల దిగుబడి తక్కువగా ఉండటంతో రేట్లు పెంచక తప్పడం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్‌ లాంటి మహానగరంలో నలుగురు ఉన్న ఒక సాధారణ కుటుంబానికి నెలకు సరుకులు, పాలు, కూరగాయల కోసం సగటున రూ. 9,500 వరకు ఖర్చయ్యేది. కానీ ప్రస్తుత ధరల భారాన్ని బట్టి రూ. 12,000 కూడా సరిపోవడం లేదు. నెలలో సగం రోజులకే పర్సు ఖాళీ అవుతోందని, కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తోందని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల ధాటికి తాళలేక దసరా సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లే ప్లాన్లను కూడా జనం వాయిదా వేసుకుంటున్నారు.

ఇదెలా ఉంటే.. మరోవైపు పండుగకు సొంతూళ్లకు వెళ్దామనుకుంటున్న ప్రజలపై రవాణా భారం పడింది. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాబోయే 15 నుంచి 20 రోజుల్లో వర్షాలు పడకపోతే ఆహారధాన్యాల ధరలు మరో 10 నుంచి 20 శాతం పెరిగే ప్రమాదం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. ధరల భయంతో మార్కెట్‌లో సరుకుల డిమాండ్ కూడా 30 శాతం వరకు పడిపోయింది.

Join Our Whatsapp Channel

నిత్యావసరాలతో పాటు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కూడా తామేం తీసిపోమంటూ పోటీపడి రేట్లు పెంచేసాయి. రాగి, ఉక్కు, ప్లాస్టిక్ వంటి ముడి పదార్థాలు, మెమరీ చిప్‌ల ధరలు పెరగడంతో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల రేట్లు పైపైకి వెళ్లాయి. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్‌ల సగటు విక్రయ ధరలు 32 శాతం, ఏసీల ధరలు 11 శాతం, స్మార్ట్‌ఫోన్ల ధరలు 7 శాతం పెరిగాయి. గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది ల్యాప్‌టాప్‌ల సగటు ధరలు ఏకంగా 41 శాతం పెరగడం గమనార్హం. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన సామాన్యుడు ఇలా పెరిగిన ధరలతో అల్లాడిపోతున్నాడు. మార్కెట్‌లో నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలను అరికట్టి, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటేనే ధరలు అదుపులోకి వచ్చి సామాన్యుడికి ఊరట లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి పెరిగిన ఈ ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.

Tags :

  • SumanTV News
  • తెలంగాణ ధరల పెరుగుదల
  • దసరా పండుగ ధరలు
  • నిత్యావసర ధరలు
  • పప్పుల ధరలు
  • బతుకమ్మ పండుగ
  • బియ్యం ధరలు
  • రైస్ ప్రైస్ ఇన్ తెలంగాణ
  • హైదరాబాద్ మార్కెట్ ధరలు
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam