SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Vijayasai Reddy New Party Dasara

దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • Written By: Ayyappa Panja
  • Updated On - Tue - 13 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
దసరాకి పార్టీ జెండా, ఎజెండా సిద్దం.. విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన

ఏపీ పాలిటిక్స్ లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా ఆయన ఒక కీలక అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. తాను కొత్త పార్టీ పెట్టడం లేదని, ఒత్తిళ్లకు తలొగ్గి వెనకడుగు వేశానని, తనను ఎవరో బెదిరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాలపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. పార్టీ పెట్టకూడదని కోరుకునే ప్రత్యర్థులే ఇలాంటి చౌకబారు ప్రచారాలు చేస్తున్నారని, వాటికి ఎలాంటి విలువా లేదని ఆయన కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే తన కొత్త పార్టీ ఆవిర్భావాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి ఏపీ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం సృష్టించారు.

ఈ పవిత్రమైన దసరా పర్వదినాల్లోనే తన నూతన పార్టీ పేరు, జెండా, ఎజెండా సిద్ధమవుతున్నాయని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండు కుటుంబాలే నిరంతరం పాలన సాగిస్తున్నాయని, వారి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ రెండు కుటుంబాల పాలనపై తిరుగుబాటుగా ప్రతి నియోజకవర్గంలోనూ మెరికల్లాంటి కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తానని ప్రకటించారు. రాబోయే రోజుల్లో అధికారం పూర్తిగా జెన్-జీ యువతదేనని, తమ పార్టీలో అన్ని వర్గాల ప్రాతినిధ్యంతో పాటు యువతకే సింహభాగం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

చంద్రబాబు, జగన్ కుటుంబ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నూతన రాజకీయాలకు శ్రీకారం చుడతామని విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే తాను స్థాపించబోయే పార్టీలో తాను గానీ, తన కుటుంబసభ్యులు గానీ ముఖ్యమంత్రి రేసులో ఉండబోరని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒక మార్గదర్శకుడిగా ఉండి, శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే తరహా పాత్రను మాత్రమే పోషిస్తానని మరోసారి ప్రకటించారు. రాజకీయంపై పూర్తి పట్టున్న, ప్రజలకు మేలు చేయగల ఒక ప్రముఖ వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతానని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక పార్టీ ఆవిర్భావ ప్రకటన వాయిదా పడటానికి గల కారణాలను వివరిస్తూ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు. మంగళవారం నుంచి వారం రోజుల పాటు తాను ఆయుర్వేద చికిత్స నిమిత్తం వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, ఆ కోడ్ ముగిసిన తర్వాతే పూర్తి వివరాలతో తన కొత్త పార్టీ ఆవిర్భావాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. చికిత్స పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే రాజకీయాల్లో స్పీడ్ పెంచుతానని తెలిపారు.

ఏపీ పాలిటిక్స్ లో రెండు కుటుంబాల పాలనకు ప్రత్యామ్నాయంగా నిలుస్తానని చెబుతున్న విజయసాయిరెడ్డి వ్యూహం ఏ మేరకు సఫలమవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన తీసుకున్న ఈ తాత్కాలిక విరామం, రాబోయే ఆవిర్భావ ప్రకటన రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాల్సిందే.

పార్టీ పేరు, జెండా, ఎజెండా ఈ పవిత్ర దసరా పర్వ దినాల్లో సిద్ధం అవుతున్నాయి. నేను పార్టీ పెట్టరాదని కోరుకుంటున్న వారంతా చేస్తున్న చౌకబారు ప్రచారాలకు ఎలాంటి విలువా ఉండదు. రెండు కుటుంబ పార్టీలమీద తిరుగుబాటుగా, ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ మెరికల్లాంటి కొత్త నాయకత్వం తయారు చేస్తా. మరోసారి చెపుతున్నా… అధికారం జెన్‌–జీది, నాది బాల్‌ఠాక్రే పాత్ర.

@JaiTDP @JanaSenaParty @BJP4India @BJP4Andhra @YSRCParty @INCIndia @cpimspeak @cpofindia
@TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu
@10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp

— Vijayasai Reddy V (@VSReddy_MP) October 13, 2026

Tags :

  • Andhra Pradesh News
  • Ap Politics
  • ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
  • దసరా
  • రాజకీయ వార్తలు
  • విజయసాయిరెడ్డి
  • విజయసాయిరెడ్డి కొత్త పార్టీ
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రాజ్ భవన్ మార్చ్‌ వేళ తీవ్ర ఉద్రిక్తత.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్

    రాజ్ భవన్ మార్చ్ వేళ ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

  • దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన ఉద్యోగిని.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

    దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

    డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ‘స్వయం AP’తో కొత్త అవకాశాలు!

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

    కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam