దేవర’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ మార్ఫింగ్ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు . ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను అత్యంత అసభ్యకరంగా, కించపరిచేలా ఈ డీప్‌ఫేక్ వీడియోను చెయ్యడంపై ఆయన ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు
ఈ చర్యను జూనియర్ ఎన్టీఆర్ అసహ్యకరమైన, రోత పుట్టించే, సిగ్గుమాలిన చర్య అని అభివర్ణించారు. మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే మన సంస్కృతిలో, మాతృదేవోభవ అనే నేలపై కొందరు ఇంత నీచంగా దిగజారడం ఛిగ్గుచేటన్నారు.
ఈ మార్ఫింగ్ వీడియో వెనుక ఉన్నవాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని హెచ్చరించారు. దీనిని సృష్టించిన వారితో పాటు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి నకిలీ కంటెంట్‌ను ఎవరూ చూడొద్దని, షేర్ చేయొద్దని చెప్పారు. ఈరోజు బాధితురాలు మరొకరు కావచ్చు.. రేపు అది మీ ఇంట్లోని తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె కావచ్చు అని మండిపడ్డారు .
ఏఐ సాంకేతికత దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు మరియు చట్టాలనుతీసుకురావాలని ఎన్టీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు నటి జాన్వీ కపూర్ కూడా ఈ ఘటనపై స్పందించారు, ఇది ఏఐ సాంకేతికతను స్పష్టంగా దుర్వినియోగం చేయడమేనని, ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రచారం చేయవద్దని కోరారు.
మరో ఈ వీడియో మార్ఫింగ్ చేయడంపై హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి నకిలీ వీడియోలను క్రియేట్ చేయడం, షేర్ చేయడం ఏఐ దుర్వినియోగమేన్నారు. ఈ వికృత చేష్టలకు పాల్పడిన వారిపై తప్పకుండా తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆమె గట్టిగా హెచ్చరించారు.
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where “Matrudevo Bhava” is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using…
— Jr NTR (@tarak9999) October 3, 2026
