SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » health » Ai Medical Revolution Cancer Alzheimers Cure Future 2026

క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Wed - 11 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇక క్యాన్సర్, గుండె జబ్బులకు కాలం చెల్లినట్టేనా? AI సృష్టించబోతున్న వైద్య విప్లవం ఇదే!

మనిషికి వచ్చే అత్యంత భయంకరమైన జబ్బులు ఏవి అని అడిగితే.. ముందుగా గుర్తొచ్చేవి క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు. వీటి పేరు వింటేనే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, మరో పదేళ్లలో ఈ వ్యాధులన్నీ కేవలం చరిత్ర పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోతాయంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. అంటే కృత్రిమ మేధస్సు వైద్య రంగంలో అలాంటి పెను విప్లవాన్నే తీసుకురాబోతోందని ప్రపంచ టెక్ దిగ్గజాలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. నిజంగానే ఏఐ వైద్య రంగాన్ని సమూలంగా మార్చేస్తుందా? రానున్న రోజుల్లో ఏఐ ద్వారా ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ. తాజాగా ప్రముఖ ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ సీఈఓ డారియో అమోడెయ్ చేసిన వ్యాఖ్యలు వైద్య, సాంకేతిక రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రానున్న పదేళ్లలో క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక అనారోగ్యాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన సంచలన అంచనా వేశారు. వేల ఏళ్లుగా మానవాళిని వేధిస్తున్న వ్యాధులకు ఏఐ ద్వారా అద్భుతమైన పరిష్కారాలు దొరుకుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం అమోడెయ్ మాత్రమే కాదు.. గూగుల్ ఏఐ విభాగం అధిపతి డెమిస్ హసాబిస్, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఒక కొత్త మందు తయారు చేయడానికి పదేళ్ల సమయం పడితే, ఏఐ ఆ సమయాన్ని కేవలం కొన్ని వారాలకు కుదించగలదని హసాబిస్ చెబుతున్నారు.

అసలు ఏఐ వైద్య రంగంలో ఎలాంటి అద్భుతాలు చేయబోతోంది? దీనికి ప్రధాన ఉదాహరణ గూగుల్ రూపొందించిన ‘ఆల్ఫాఫోల్డ్’ టూల్. మానవ శరీరంలోని 20 కోట్లకు పైగా ప్రొటీన్ల నిర్మాణాలను ఏఐ అత్యంత కచ్చితత్వంతో అంచనా వేసి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. దీనివల్ల వ్యాధి మూలాలను గుర్తించడం చాలా సులభమైంది.జబ్బు లక్షణాలు బయటపడకముందే, మన రక్త నమూనాలు, స్కానింగ్ రిపోర్టులను విశ్లేషించి, భవిష్యత్తులో రాబోయే క్యాన్సర్ లేదా గుండెపోటును ఏఐ ముందే పసిగడుతుంది. అందరికీ ఒకే మందు కాకుండా, ఒక వ్యక్తి డీఎన్ఏ ఆధారంగా కేవలం ఆ వ్యక్తికి మాత్రమే పనిచేసే ప్రత్యేక మందులను ఏఐ డిజైన్ చేస్తుంది. ఏఐ ఆధారిత రోబోలు మనిషి చేతికి సాధ్యం కాని అత్యంత సూక్ష్మమైన ఆపరేషన్లను కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేస్తాయి.

Join Our Whatsapp Channel

పదేళ్లలో పెద్ద జబ్బులు మాయమైపోతాయంటే అంతకంటే కావాల్సింది ఏముంది? కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించే అద్భుతాలకు, మనిషి శరీరంలో జరిగే మార్పులకు మధ్య చాలా పెద్ద అగాధం ఉందని ఔషధ రంగ నిపుణులు గట్టిగా వాదిస్తున్నారు. అయితే ఏఐ దిగ్గజాల అంచనాలపై… ప్రముఖ ఫార్మా సంస్థ ‘వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్’ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ లీడెన్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. సుమారు 10 వేల ఔషధ సమ్మేళనాలను పరిశీలించడానికి తాము 50 ఏఐ సంస్థల సాంకేతికతను పరీక్షించామని, కానీ వాటిలో ఏ ఒక్కటీ స్వతంత్రంగా పనిచేసే పూర్తిస్థాయి ఔషధాన్ని తయారు చేయలేకపోయిందని ఆయన స్పష్టం చేశారు. కంప్యూటర్ నమూనాలో ఒక మందు బాగా పనిచేస్తుందని తేలడం కేవలం మొదటి అడుగు మాత్రమే. ఆ తర్వాత ఆ మందును ప్రయోగశాలల్లో, జంతువులపై, ఆపై వేలాది మంది మనుషులపై ‘క్లినికల్ ట్రయల్స్’ నిర్వహించాలి. ఆ మందు సురక్షితమా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అని తేలడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుందని తెలిపారు. నియంత్రణ సంస్థల అనుమతులు రావాలని… అందుకే ఒక కొత్త మందు మార్కెట్లోకి రావడానికి కనీసం 10 నుండి 12 ఏళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు.

Tags :

  • AI Healthcare
  • AI Revolution
  • AI Technology
  • AlphaFold
  • Alzheimer's Disease
  • Artificial intelligence
  • Cancer Treatment
  • Health News Telugu
  • Heart diseases
  • Medical Research
  • Technology News
Read Today's Latest healthNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంత్రాలకు హృదయం ఉంటుందా? యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI ఏజెంట్లు

యంత్రాలకు హృదయం ఉంటుందా? యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI ఏజెంట్లు

  • బ్రెయిన్ మెమోరి పవర్‌పై విశేష కృషి..ముగ్గురికి నోబెల్ అవార్డ్

    బ్రెయిన్‌పై అద్భుత పరిశోధన.. ముగ్గురికి నోబెల్ అవార్డ్

  • 2వేల క్యాన్సర్ మెడిసిన్‌ 27 వేలకు అమ్మకం..సుప్రీం సీరియస్

    2 వేల క్యాన్సర్ మెడిసిన్‌ రూ.27 వేలకు అమ్మకం.. సుప్రీంకోర్టు సీరియస్

  • Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

    మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా స్టార్ట్.. నిర్మాతగా సుకుమార్.. హీరోయిన్ ఎవరంటే?

  • ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

  • క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. 11:11 గంటలకు ఒంటికాలిపై నిలబడిన ఆటగాళ్లు!

Most viewed

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • వేటకు వెళ్లి విగతజీవులుగా తిరిగొచ్చిన మత్స్యకారులు.. కొత్తపట్నం బీచ్‌లో ఘోర విషాదం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam