ఘనంగా ప్రారంభమైన ‘జటాయు’
రోషన్-ఇంద్రగంటి సినిమా షురూ
ఇంద్రగంటి పాన్-ఇండియా మూవీ లాంచ్
పూజా కార్యక్రమాలతో రోషన్ ‘జటాయు’
ఎప్పుడూ వైవిధ్యమైన, క్లాస్ సినిమాలతో అలరించే ఇంద్రగంటి.. ఈసారి తన శైలికి భిన్నంగా ఒక భారీ పాన్-ఇండియా సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జటాయు’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో రోషన్ తండ్రి, నటుడు శ్రీకాంత్ క్లాప్ కొట్టగా, స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందించారు.
ఈ సినిమా కోసం రోషన్ మేక తన లుక్, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకుంటూ ఒక పవర్ఫుల్ అవతారంలో కనిపించనున్నారు.
అశోక క్రియేషన్స్ బ్యానర్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బాలుసు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి రేఖా పాండే హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, వినయ్ రాయ్ విలన్/కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ గౌర హరి సంగీతం అందిస్తుండగా, అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ లీ విట్టేకర్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారం నుండి ప్రారంభం కానుంది.
