దొంగ నా కొడుకు టు DNK సెన్సార్ తిప్పలు
రవితేజ రిలీజ్ చేసిన మోస్ట్ చిల్లర్ ట్రైలర్
అప్పులు తీర్చడానికి క్రేజీ దొంగతనం కథ
జనరల్‌గా యూట్యూబ్‌లో రీల్స్, షార్ట్స్ చూస్తూ.. ‘అరేయ్ వీడెవడ్రా బాబు భలే నవ్విస్తున్నాడు’ అనుకునే లోపే, సైలెంట్‌గా థియేటర్లలోకి దూరి హీరో అయిపోయాడు మౌళి లిటిల్ హార్ట్స్ తో ఆల్రెడీ ఒక హిట్ కొట్టేసిన మనోడు.. ఇప్పుడు రెండో సినిమాతో వస్తున్నాడు. సినిమా పేరు మొదట ‘దొంగ నా కొడుకు’ అని పెట్టారు. పేరు వినగానే మన సెన్సార్ బోర్డు వాళ్లకి ఎక్కడో కాలి! ‘బాబూ.. అంత తిట్టకండి, షార్ట్ కట్ చేసుకోండి’ అనేసరికి, మనోళ్లు తెలివిగా ‘డీఎన్‌కే’ అని మార్చేశారు
ఈ ‘మోస్ట్ చిల్లర్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్’ ట్రైలర్‌ని.. మన మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేశారు. ట్రైలర్ చూశాక నాకైతే ఒకటి అర్ధమైంది ఇది సినిమా కాదు, థియేటర్లలో రెండు గంటల పాటు నడిచే లైవ్ మీమ్ ఫెస్టివల్! అసలు ఈ ట్రైలర్‌లో మౌళి ఏం చేశాడు? మనోడికి బంగారం షాప్ వాళ్లకి ఉన్న లింక్ ఏంటి? అనేది చూసేద్దాం.
“ప్రస్తుత జనరేషన్ కుర్రాళ్ళు ఎలా ఉన్నారో.. ఈ సినిమాలో మన హీరో మౌళి క్యారెక్టర్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. పనీపాటా లేకుండా తిరగడం, అడిగితే ‘లైఫ్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా బ్రో’ అనడం మనోడి స్టైల్. దీనికి తోడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలని క్రికెట్ బెట్టింగులు వేయడం, ఉన్నవన్నీ ఊడ్చేసుకోవడం! ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వాడు ఫోన్ చేసి బూతులు తిడుతుంటే.. ఆ అప్పులు తీర్చడానికి ఆఖరికి లవర్ పాకెట్ మనీకి కూడా కన్నం వేస్తాడు మన హీరో.
అయితే ఇక్కడే కథలో ట్విస్ట్ వస్తుంది. లవర్ వాళ్ల నాన్న ఎంట్రీ ఇచ్చి ‘నెల రోజుల్లో నా కూతుర్ని మెయింటైన్ చేసే రేంజ్ లేకపోతే.. నీ అడ్రస్ గల్లంతే’ అని అల్టిమేటం జారీ చేస్తాడు. దాంతో మన చిల్లర్ హీరో.. ‘ఎలాగైనా సరే షార్ట్ కట్ లో సెటిల్ అయిపోవాలి’ అని డిసైడ్ అయి, తన ఫ్రెండ్ బాబ్లూతో కలిసి ఒక బంగారం షాపులో దొంగతనానికి స్కెచ్ వేస్తాడు.
జనరల్‌గా దొంగతనం అంటే గూస్‌బంప్స్ రావాలి.. కానీ వీళ్లు చేసే దొంగతనం చూస్తుంటే థియేటర్లో నవ్వు ఆపుకోలేం. అసలు వీళ్లు బంగారం దొంగతనం చేశారా? లేక దొరికేసి పోలీసుల చేత తన్నులు తిన్నారా? దొంగిలించిన నగలు ఏమయ్యాయి? అనేది మెయిన్ పాయింట్.
డైరెక్టర్ శ్రీను కంబాల.. మన రోజువారీ సోషల్ మీడియాలో వినిపించే బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఇన్‌స్టాగ్రామ్ వాడుక భాషని ట్రైలర్‌లో దట్టించి పెట్టాడు. థియేటర్ కి వెళ్లే ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇది కొంచెం ‘హార్డ్’ గా అనిపించినా.. యూత్ అండ్ బ్యాచిలర్స్‌కి మాత్రం ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది. పైగా టాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ దీని వెనక ఉంది కాబట్టి.. ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.
సో అదన్నమాట మ్యాటర్! లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్లకి.. ఈ నవంబర్ 13న, థియేటర్లలో ఫుల్ లెంగ్త్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘డీఎన్‌కే’ రెడీగా ఉంది. మౌళి సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ నుంచి.. థియేటర్లలో ఆడియన్స్‌ని ఇన్ ఫ్లుయెన్స్ చేసే రేంజ్‌కి ఎలా ఎదిగాడో చూడాలంటే ఫస్ట్ డే ఫస్ట్ షో పడాల్సిందే! మరి ఈ ట్రైలర్ లో మీకు బాగా నచ్చిన మీమ్ డైలాగ్ ఏంటో కింద కామెంట్ చేయండి.
