థియేటర్ల ముందు కటౌట్లు లేవు, కోట్ల బడ్జెట్ బిల్డప్‌లు లేవు. కానీ, అక్టోబర్ 17న దసరా కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రాగానే సీన్ రివర్స్ అయిపోయింది! కమర్షియల్ యాక్షన్ సినిమాల పోటీని తట్టుకుని, కేవలం కంటెంట్, మట్టి వాసనతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.ఉత్తరాంధ్రలో ఊళ్లకు ఊళ్లే బస్సులు, ట్రాక్టర్లు కట్టుకుని థియేటర్లకు తరలివచ్చారు. బుర్రకథ సీన్లకు, ఆనంది పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు థియేటర్లలో క్లాసులు, మాసులు అనే తేడా లేకుండా స్క్రీన్లపైకి పైసలు విసిరారు. ట్రేడ్ పండితుల లెక్కలను తిరగరాస్తూ, కేవలం మౌత్ టాక్‌తోనే కోటికి పైగా కలెక్షన్లు రాబట్టి రియల్ బాక్సాఫీస్ ‘విన్నర్’ అనిపించుకుంది. విమర్శకులు సైతం “ఇది సినిమా కాదు, ఒక ఎమోషనల్ రైడ్” అంటూ రేటింగుల వర్షం కురిపించారు.
థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో ఊచకోత కోసిన ఈ రియల్ స్టోరీ, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌లను బ్లాస్ట్ చేయడానికి రెడీ అయిపోయింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. వచ్చే నవంబర్ 13 నుండి ఈ జానపద జాతర మీ మొబైల్ స్క్రీన్స్, స్మార్ట్ టీవీల్లో ప్రత్యక్షం కాబోతోంది. థియేటర్‌లో టికెట్లు దొరకక మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు, “అసలు ఏముందిరా ఈ సినిమాలో.. ఉత్తరాంధ్రోళ్లు అంతలా ఊగిపోయారు?” అని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్న గ్లోబల్ ఆడియన్స్‌కు ఇది పక్కా వీకెండ్ బిరియాని కాబోతోంది.
ఆంధ్రప్రదేశ్ మర్చిపోయిన దిగ్గజ బుర్రకథ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి జీవితాన్ని దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము కళ్లకు కట్టినట్టు చూపించారు. 1970ల బ్యాక్‌డ్రాప్.. పల్లెటూరి జానపద కళాకారిణిగా మొదలై, స్టేజ్ ఎక్కితే వేలాది మందిని ఊపేసే స్టార్డమ్ తెచ్చుకోవడం ఒక ఎత్తు. ఆ తర్వాత ఊరి పెద్దల కుట్రలు, నమ్మకద్రోహాలు, సొంత మనుషుల మోసాల మధ్య ఆమె జీవితం ఎలా తలకిందులైందనేది మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.
అన్ని కోల్పోయినా, ఒంటరి మహిళగా తన ఆత్మగౌరవం కోసం, నమ్ముకున్న కళ కోసం సమాజంతో ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తుంది. చరన్ అర్జున్ ఇచ్చిన మ్యూజిక్, ముఖ్యంగా “కోసిందీ కొయ్యగూర” సాంగ్ థియేటర్లలో ఊపేసింది, ఇప్పుడు ఓటీటీలో లూప్‌లో మోగిపోనుంది. థియేటర్లలో హిస్టరీ క్రియేట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’.. నవంబర్ 13న మీ ఇంట్లోనే హోమ్ థియేటర్ ఆన్ చేసి చూసేందుకు రూట్ క్లియర్ చేసుకుంది. గెట్ రెడీ ఫర్ ది ఎమోషనల్ జాతర!
