తెలంగాణకు బిగ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో రెండ్రోజులు అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఏయే ప్రాంతాల్లో ప్రభావం అధికంగా ఉంటుందో తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ఈ నెల 25వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్తా 26 నాటికి వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరాన తీరం దాటనుందని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా రానున్న రోజుల్లో ముఖ్యంగా ఈ నెల 26, 27 తేదీల్లో భారీ నుంచి […]