SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Murusu Cyclone Andhra Pradesh Floods Five Dead

మురసు తుపాను బీభత్సం.. వరదల్లో చిక్కుకున్న గ్రామాలు.. ఐదుగురు మృతి!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Thu - 5 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ముంచేసిన మురసు..జల దిగ్బంధంలో గ్రామాలు..ఐదుగురు మృతి..!

తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలు వణికిపోయాయి. రెండు రోజుల వ్యవధిలోనే జిల్లాలో సగటున 18.3 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా నుంచి వస్తున్న వరద నీరు గుంటూరు జిల్లాను ముంచెత్తింది. నల్లమడ, ఓగేరు, ఎర్రవాగులకు పలుచోట్ల గండ్లు పడటంతో వరద ప్రవాహం పంట పొలాలను ఊడ్చేసింది. కాకుమాను మండలంలో రెండు రోజుల్లోనే ఏకంగా 26 సెంటీమీటర్లకు పైగా వర్షం పడటంతో నల్లమడ వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో గార్లపాడు, కొప్పర్రు గ్రామాలు నాలుగు వైపులా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జలవనరుల శాఖ కాలువలు, చెరువుల కట్టలు తెగడంతో శాశ్వత మరమ్మతులకు రూ.6.75 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.

జిల్లావ్యాప్తంగా దాదాపు 38,062 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. పత్తి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, వరి పైరు నేలవాలింది. ఇక 17 చోట్ల ప్రధాన రహదారులు కోతకు గురవడంతో పెదనందిపాడు-బాపట్ల మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 55 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. ఈ ప్రకృతి బీభత్సం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మేడికొండూరు మండలం కొర్రపాడుకు చెందిన రాయపాటి బాలాజీ వరద నీటిలో పడి మృతి చెందగా.. తాడేపల్లి మండలం పెనుమాక కొండ ప్రాంతంలో రేకుల షెడ్డుపై కొండచరియలు విరిగిపడి షేక్ మీరాబి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో గల్లంతైన షణ్ముఖ బాబు, రాగి రాజ్‌కుమార్ మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. బాధిత ప్రజల కోసం అధికారులు జిల్లావ్యాప్తంగా 58 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, 4,217 మందికి ఆశ్రయం కల్పించారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాకారం కొంతభాగం కూలిపోయింది.

ఇక ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై కూడా మురసు తుపాను తీవ్ర ప్రభావం చూపింది. గోపాలపురంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద భారీగా వరద నీరు చేరడంతో అధికారులు, సిబ్బంది నీటిలో చిక్కుకుపోయారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ, SDRF బృందాలు రంగంలోకి దిగి తాడు సహాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో సీఐ నాగేశ్వర నాయక్ నీటిలో పడిపోగా సిబ్బంది సృజనాత్మకంగా కాపాడారు. రాజమహేంద్రవరం నగరం పూర్తిగా ముంపునకు గురైంది. కోటిపల్లి బస్టాండ్, ఆర్యాపురం, కంబాలచెరువు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాకినాడ జిల్లా కరప మండల పరిషత్తు కార్యాలయంలోకి వరద నీరు చేరడంతో వేళంగి గ్రామానికి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ బ్యాలట్ పత్రాలు తడిసిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో బస్టాండు ప్రాంగణం జలమయం కాగా, పోలింగ్ కేంద్రాలు ముంపునకు గురవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

Join Our Whatsapp Channel

ఏలూరు జిల్లాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. తెలంగాణలోని పెదవాగు ప్రాజెక్టు రింగుబండ్ తెగిపోవడంతో వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం, ఒంటిబండ, పూచిరాల తదితర గ్రామాలపై వరద నీరు ఒక్కసారిగా పోటెత్తింది. 2022 నాటి వరద భయాలు మళ్లీ ఇక్కడి ప్రజలను వెంటాడుతున్నాయి. జిల్లాలోనే అత్యధికంగా జీలుగుమిల్లిలో 39.8 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఇదే సమయంలో రౌతుగూడెం సమీపంలో వరద ప్రవాహంలో 20 మంది కూలీలు చిక్కుకుపోయారు. NDRF బృందాలు పడవలు, ప్రత్యేక పరికరాలతో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, సహాయక బృందాలు ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Tags :

  • Andhra Pradesh Floods
  • AP Rain News
  • Cyclone Impact AP
  • Five People Died
  • Floods in Andhra Pradesh
  • Godavari Floods
  • Guntur Heavy Rains
  • Murusu Cyclone
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మురసు తుఫాన్ ప్రభావం.. 4 రోజులు భారీ వర్షాలు

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో 4 రోజులు భారీ వర్షాలు!

  • భారీ వర్షాలకు ఉధృతంగా గోదావ‌రి! 100కు పైగా గ్రామాలు!

    భారీ వర్షాలకు ఉధృతంగా గోదావ‌రి! 100కు పైగా గ్రామాలు!

  • భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. ఇంకో 3 అడుగులు పెరిగితే..!

    భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. ఇంకో 3 అడుగులు పెరిగితే..!

  • వీడియో: వరద నీటిలో కొట్టుకుపోయిన మహిళా టీచర్.. కాపాడిన స్థానికులు..

    వీడియో: వరద నీటిలో కొట్టుకుపోయిన మహిళా టీచర్.. కాపాడిన స్థానికులు..

  • Godavari Floods: ఎంపీ రఘురామను చంపి ఆ నేరం వేరే వారిపై నెట్టాలని చూశారు: చంద్రబాబు

    Godavari Floods: ఎంపీ రఘురామను చంపి ఆ నేరం వేరే వారిపై నెట్టాలని చూశారు: చంద్రబాబు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రామాయణంలో సీతగా సాయి పల్లవి.. మేకప్ లేకుండానే దైవిక అందం.. నటనకు ఫిదా అవుతున్న నెటిజన్లు!

  • ట్రంప్ అహంకారానికి అమెరికా ప్రజల చెక్..! మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం..!

  • మురసు తుపాను బీభత్సం.. వరదల్లో చిక్కుకున్న గ్రామాలు.. ఐదుగురు మృతి!

  • దీపావళికి ముందే బంగారం ధరల షాక్.. ఒక్కరోజే రూ.3,220 పెరుగుదల!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • జాలర్లను కాపాడబోయి వరదలో చిక్కుకున్న SDRF సిబ్బంది.. 11 మంది క్షేమం!

  • రాప్తాడు బాలికకు ఊరట.. ఆర్థోపెడిక్ సర్జరీ సక్సెస్.. లోకేశ్ కీలక ప్రకటన!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam