తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలు వణికిపోయాయి. రెండు రోజుల వ్యవధిలోనే జిల్లాలో సగటున 18.3 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా నుంచి వస్తున్న వరద నీరు గుంటూరు జిల్లాను ముంచెత్తింది. నల్లమడ, ఓగేరు, ఎర్రవాగులకు పలుచోట్ల గండ్లు పడటంతో వరద ప్రవాహం పంట పొలాలను ఊడ్చేసింది. కాకుమాను మండలంలో రెండు రోజుల్లోనే ఏకంగా 26 సెంటీమీటర్లకు పైగా వర్షం పడటంతో నల్లమడ వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో గార్లపాడు, కొప్పర్రు గ్రామాలు […]