జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అనా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించిన వేళ.. అసలు వీరిద్దరి జర్నీ ఎలా సాగింది?
తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ ఉన్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జీవితంలోకి ఆమె ఎలా ప్రవేశించింది? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది?
అసలు అనా లెజినోవా ఎవరు? పవన్‌తో ఆమెకు పరిచయం ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం.
అనా లెజినోవా రష్యా దేశస్థురాలు. రష్యాలో పుట్టి పెరిగిన ఆమె.. ఒక మోడల్‌తో పాటు మంచి నటి కూడా. ఈ ఇద్దరి కథకు వేదికైంది టాలీవుడ్ చిత్రం ‘తీన్ మార్’. ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం రష్యా నుంచి వచ్చిన అనా లెజినోవా ఎంపికయ్యారు. షూటింగ్ సమయంలోనే పవన్ కల్యాణ్‌కు, అనాకు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. ఆ కష్టకాలంలో అనా లెజినోవా పరిచయం, ఆమె చూపించిన ఆత్మీయత పవన్‌కు ఎంతో ఊరటనిచ్చాయి. సినిమా సెట్స్‌పై మొదలైన వీరి పరిచయం.. క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత రెండేళ్ల పాటు బలమైన ప్రేమగా రూపాంతరం చెందింది.
రెండు సంవత్సరాల డేటింగ్ అనంతరం.. ఈ జంట తమ బంధాన్ని అధికారికం చేసుకోవాలని నిర్ణయించుకుంది. 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరి వివాహం అత్యంత సింపుల్‌గా జరిగింది. ఈ వైవాహిక బంధం ద్వారా వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె పేరు పొలీనా అంజనా పవనోవా, కుమారుడి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. అనా లెజినోవా తన పిల్లలను భారతీయ తెలుగు సంస్కృతికి అలవాటు చేస్తూ పెంచడం విశేషం.
పవన్ కల్యాణ్‌తో అనా లెజినోవా సాన్నిహిత్యం ఎప్పుడూ ఎంతో ప్రత్యేకం. ఆమె రష్యన్ అయినప్పటికీ, మెగా కుటుంబ సంప్రదాయాలను, ముఖ్యంగా హిందూ సంస్కృతిని ఎంతో గౌరవించేవారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించి జనసేన పార్టీని స్థాపించినప్పుడు, ఆ ఒత్తిడితో కూడిన ప్రయాణంలో ఆమె ఎల్లప్పుడూ వెనుక ఉండి నడిపించారు.పబ్లిక్ లైఫ్, మీడియా లైమ్‌లైట్‌కు ఆమె ఎప్పుడూ దూరంగా ఉండటానికే ఇష్టపడేవారు. అయితే, 2024 ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించిన తర్వాత పవన్ కల్యాణ్‌కు హారతి ఇచ్చి, తిలకం దిద్దిన అనా విజువల్స్ అప్పట్లో నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యాయి. పవన్ కల్యాణ్ కూడా ఆమె చదువును ప్రోత్సహించారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో అనా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినప్పుడు పవన్ స్వయంగా అక్కడికి వెళ్లారు. వివాహం తర్వాత ఆమె తన పేరును కూడా ‘అనా కొణిదెల’గా మార్చుకున్నారు.
తీన్ మార్ సెట్స్ లో మొదలై.. తిరుమల కొండల వరకు.. ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తూ, భారతీయ సంస్కృతిని గుండెల్లో నింపుకున్న ఒక విదేశీ వనిత జర్నీ.. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో 13 ఏళ్ల పాటు ఒక మధుర ఘట్టంగా నిలిచిపోయింది. విభేదాలు ఏవైనప్పటికీ, తాము విడిపోతున్నా మంచి స్నేహితులుగా ఉంటామని, పిల్లల శ్రేయస్సే ముఖ్యమని వారు హుందాగా ప్రకటించడం వారి మెచ్యూరిటీని తెలియజేస్తోంది.
