SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » photos » Ramayana Box Office Breaks Dhurandhar 2 Pushpa 2 Records

గంటలో 1.10 లక్షల టికెట్లు.. ధురంధర్ 2, పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టిన రామాయణ!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Tue - 10 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బుక్‌మైషోలో సరికొత్త ఆల్-టైమ్ రికార్డ్..

ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా వచ్చిన ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మైథలాజికల్ వండర్.. టికెట్ అమ్మకాల్లో సరికొత్త ఆల్-టైమ్ రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా బుక్‌మైషోలో ఈ సినిమా క్రియేట్ చేసిన రేంజ్ అంతా ఇంతా కాదు. గంట వ్యవధిలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా నిలిచి, ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఆ నయా రికార్డుల సునామీ ఏంటో ఇప్పుడు చూద్దాం!

విడుదలకు ముందు ‘ధురంధర్ 2’ చిత్రంతో పోలిస్తే ‘రామాయణ’ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కొంత మెల్లగానే మొదలయ్యాయి. కానీ, థియేటర్లలోకి వచ్చాక ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో సీన్ రివర్స్ అయిపోయింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఒక్కసారిగా పుంజుకుంది. దీనికి తోడు దీపావళి పండుగ సెలవులు ఈ చిత్రానికి భారీగా ప్లస్ అయ్యాయి. సినిమా విడుదలైన ఐదవ రోజైన ఈరోజు.. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కేవలం ఒకే ఒక్క గంట వ్యవధిలో ఏకంగా 1.10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. బుక్‌మైషోలో 2023 ఆగస్టు నుంచి అందుబాటులో ఉన్న గంటలవారీ ట్రాకింగ్ రికార్డుల్లో.. ఈ రేంజ్ ఘనత సాధించిన సరికొత్త రికార్డ్ ‘రామాయణ’ సొంతమైంది.

ఇప్పటివరకు ఈ రికార్డు రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ 1.09 లక్షలు పేరిట ఉండేది. అంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ 1.07 లక్షలు పేరిట ఉన్న రికార్డును ‘ధురంధర్ 2’ అధిగమిస్తే.. ఇప్పుడు ఆ రెండు చిత్రాల రికార్డులను ‘రామాయణ’ చెరిపేసి నెంబర్ వన్ ప్లేస్‌కు చేరింది. దీపావళి సెలవుల ఎఫెక్ట్‌తో నిన్నటి కంటే ఈ రోజు టికెట్ అమ్మకాలు ఏకంగా 67 శాతం పెరగడం విశేషం. అంతేకాదు, విడుదలైన మొదటి నాలుగు రోజులూ.. ప్రతిరోజూ 10 లక్షలకు పైగా బుక్‌మైషో బుకింగ్స్ సాధించిన ఆరో భారతీయ చిత్రంగా కూడా ‘రామాయణ’ రికార్డులకెక్కింది.

Join Our Whatsapp Channel

దర్శకుడు నితేశ్ తివారీ అద్భుతమైన విజువల్ వండర్‌గా మలిచిన ఈ మైథలాజికల్ డ్రామాలో.. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్ నటించి మెప్పించారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో రవి దూబే కనిపించారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థలతో పాటు యశ్ సొంత నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాలో సన్నీ డియోల్, అనుపమ్ ఖేర్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, లారా దత్తా వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించి సినిమాను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లారు.

చూశారుగా.. నెగెటివ్ కామెంట్స్, అంచనాల ఒత్తిడిని దాటుకుని ‘రామాయణ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలా విశ్వరూపం చూపిస్తోందో! కేవలం ఐదు రోజుల్లోనే ఆల్-టైమ్ రికార్డులను క్లియర్ స్వీప్ చేసిన ఈ సినిమా.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వసూళ్ల రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. పార్ట్-1 కే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే.. ఇక నెక్స్ట్ పార్ట్స్‌పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Tags :

  • bollywood news
  • BookMyShow
  • box office records
  • Dhurandhar 2
  • Pushpa- 2
  • Ramayana
  • Ramayana Movie
  • Ramayana Part 1
  • Ranbir Kapoor
  • Sai Pallavi
  • telugu movie news
  • yash
Read Today's Latest photosNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నర్గీస్ ఫక్రీతో బాలయ్య దాదా సాంగ్ లోడింగ్!

బాలయ్య ‘దాదా’ నుంచి మాస్ ట్రీట్.. నవంబర్ 13న ‘దాదా ధమాకా’ సాంగ్ రిలీజ్!

  • బుక్‌మైషోలో సరికొత్త ఆల్-టైమ్ రికార్డ్

    దీపావళి రోజు నాన్‌వెజ్ తిన్న ప్రియాంక చోప్రా.. నెట్టింట పెద్ద రచ్చ! అసలేం జరిగిందంటే?

  • రణ్‌బీర్ రాముడు కాదు.. భక్తి శక్తి! రామాయణపై ఆర్జీవీ సంచలన కామెంట్స్

    రణ్‌బీర్ రాముడు కాదు.. భక్తి శక్తి! రామాయణపై ఆర్జీవీ ప్రశంసలు

  • రాముడి విజయం.. యశ్ విధ్వంసం

    రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • ‘రామాయణ’కు రాజమౌళి, అట్లీ ప్రశంసలు !

    రామాయణ విజువల్ వండర్.. రాజమౌళి, అట్లీ ఫిదా! రణ్‌బీర్, యశ్ నటనపై ప్రశంసలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • గంటలో 1.10 లక్షల టికెట్లు.. ధురంధర్ 2, పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టిన రామాయణ!

  • గ్రీస్‌లో కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి సందడి.. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్!

  • ఢిల్లీలో విషపూరిత గాలి.. 463కు చేరిన AQI.. ప్రజలకు ఆరోగ్య హెచ్చరికలు!

  • ఏపీ స్థానిక ఎన్నికల్లో కూటమి ఓట్ల శాతం పెరిగింది.. వైసీపీకి 6.25 శాతం తగ్గిందన్న చంద్రబాబు

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • శ్రీశైలం టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం.. బస్సు బ్రేక్ ఫెయిల్.. 5 కార్లు ధ్వంసం!

  • ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. నదిలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురిని కాపాడిన స్థానికులు!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam