నటి సాయి పల్లవి హడావుడిగా సినిమాలు చేస్తూ లైమ్ లైట్‌లో ఉండాలని కోరుకోదు. తన అందాన్ని తెరమీద ప్రదర్శించేందుకు మేకప్స్ ఎక్కువ వేసుకోదు. ఎంత డిమాండ్ చేసినా యాడ్స్‌లో నటించదు. తనకు నచ్చిన సినిమాలు చేస్తూ.. కుటుంబ సభ్యులతో కావాల్సిన సమయం గడుపుతూ..వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని కూడా పరిపూర్ణం చేసుకుంటున్న నటి సాయి పల్లవి.
హీరోయిన్ సాయిపల్లవి.. చాలా పెద్ద రిస్క్ చేసేందుకు రెడీ అయిపోయిందట. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సాయిపల్లవి ఏం ప్లాన్ చేస్తోంది?
సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద బిగ్ స్టార్స్ అయినా పౌరాణిక పాత్రలలో లేదా మైథలాజికల్ క్యారెక్టర్స్ లో నటించాలని భావిస్తుంటారు. ఒకప్పుడంటే రెగ్యులర్ సినిమాలతో పాటు పౌరాణికం, మైథలాజికల్ జానర్స్ లో సినిమాలు పోటీగా తెరకెక్కుతుండేవి. తరాలు మారుతున్నకొద్దీ మూవీ మేకింగ్ లో మార్పులు వచ్చేశాయి. సినిమాలు చూసే ఆడియెన్స్ టేస్ట్ లు మారిపోయాయి. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్న టెక్నాలజీతో పాటు సినిమాలు వస్తున్నాయి.. వాటిని బట్టి.. ప్రేక్షకులు కూడా అంచనాలు పెట్టుకుంటున్నారు. అయితే.. తెరపై […]