హీరోయిన్ సాయిపల్లవి.. చాలా పెద్ద రిస్క్ చేసేందుకు రెడీ అయిపోయిందట. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సాయిపల్లవి ఏం ప్లాన్ చేస్తోంది?
సాయిపల్లవి.. మిగతా హీరోయిన్లకు ఈమెకు చాలా డిఫరెన్స్ ఉంది. అందరూ గ్లామర్ తో హిట్స్ కొడితే.. ఈమె మాత్రం యాక్టింగ్ అనే టాలెంట్ తో సూపర్ హిట్స్ కొట్టింది. అయితే ఈమె ఆచితూచి మాత్రమే సినిమాలు చేయడం ఫ్యాన్స్ కు కాస్త ఇబ్బందిగా మారింది. సాయిపల్లవి స్క్రీన్ పై కనిపించి చాలాకాలమైపోయింది. గతేడాది ‘విరాటపర్వం’లో చివరగా కనిపించిన సాయిపల్లవి.. ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో తప్పితే పెద్దగా బయట కూడా దర్శనమివ్వలేదు. ఇప్పుడు ఏకంగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుని రిస్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘పుష్ప 2’లో సాయిపల్లవి నటించనుందని వార్తలొచ్చాయి కానీ ఇది ఆల్మోస్ట్ అబద్ధమే అని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ తో ఓ సినిమా చేస్తున్న సాయిపల్లవి.. మరో సినిమా కోసం ఏకంగా రెండేళ్లు కేటాయించేందుకు సిద్ధమైందట. ప్రస్తుతం చేస్తున్న మూవీ కంప్లీట్ అయిపోతే.. పూర్తిగా దీనిపైనే కాన్సట్రేట్ చేయనుందని తెలుస్తోంది. ఆ ప్రాజెక్టు ‘రామాయణం’ అని తెలుస్తోంది. ఇందులోనే సాయిపల్లవి సీతగా యాక్ట్ చేయనుందని అంటున్నారు.
గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్.. తను మరికొందరు ప్రొడ్యూసర్స్ తో కలిసి ‘రామాయణం’ తీస్తానని చాలాకాలం క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ఆ మూవీ కోసమే నటీనటుల ఎంపిక జరుగుతోందని, సీత పాత్ర కోసం సాయిపల్లవిని ఎంపిక చేశారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ పాత్ర కోసమే సాయిపల్లవి రెండేళ్ల పాటు డేట్స్ ఇచ్చేసిందని అంటున్నారు. అయితే స్టార్ హీరోల రేంజులో ఇలా రిస్క్ చేయడం అనేది సాయిపల్లవి విషయంలో కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే హీరోయిన్లు ఎవరైనా సరే ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేయాలని చూస్తుంటారు. సాయిపల్లవి మాత్రం ఆ విషయంలో కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. సాయిపల్లవి చేస్తున్న ప్రయోగంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.