టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ యస్.యస్ థమన్ తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పాడు. తనకు నచ్చినట్టు బ్రతుకుతా ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపాడు.
టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ యస్.యస్ థమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి తిరుగులేకుండా పోతుంది. తెలుగులో టాప్ హీరోలే కాదు సౌత్ టాప్ హీరోలు కూడా థమన్ పాటలకి ఫిదా అయిపోయి వరుస ఛాన్స్ లు ఇచ్చేస్తున్నారు. కిక్ తో మొదలైన థమన్ జోరు గత 15 ఏళ్ళుగా తన మార్క్ మ్యూజిక్ తో జనాలను అలరిస్తూనే ఉన్నాడు. కాపీ ట్యూన్స్ ఇస్తాడనే పేరున్నా జనాలు అతని పాటలకు అట్రాక్ట్ అవ్వాల్సిందే. ఈ స్థితికి రావడానికి థమన్ ఎంతలా కష్టపడ్డాడో అతడికి మాత్రమే తెలుసు. చిన్నప్పుడే చదువుని వదిలేసి పాటే ప్రపంచంగా బ్రతికిన ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవితంలో సంగీతం కాకుండా మరో ఇష్టమైన ప్రపంచం ఉందని తెలుస్తుంది. అది లేకుండా థమన్ అస్సలు ఉండలేదంటా. అదేంటో కాదు తన ఫేవరేట్ స్పోర్ట్ క్రికెట్.
క్రికెట్ ఎక్కడ జరిగినా అక్కడ థమన్ వాలిపోతాడు. అయితే ఇదంతా సరదాగా చేస్తున్నాడేమో అనుకున్నారంతా. కానీ క్రికెట్ అంటే ఇతనికి ఒక ఎమోషన్ అని తెలుస్తుంది. ఇటీవలే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో థమన్ చేసిన హడావుడి బాగా పాపులర్ అయింది. లావుగా ఉన్నప్పటికీ ఎంతో యాక్టివ్ గా అభిమానులని తనదైన స్టయిల్లో అలరించాడు. అయితే ఆ తర్వాత తరచూ థమన్ క్రికెట్ ఆడుతూ కనిపించేవాడు. ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు సైన్ చేసి ఇలా సరదాగా క్రికెట్ ఆడతాడేంటి అని థమన్ మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ బాగా విమర్శిస్తున్నారు. అంతే కాదు త్రివిక్రమ్ తో మహేష్ బాబు చేయబోయే సినిమా నుంచి కూడా ఈ కారణంగానే తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ ట్రోల్స్ చేసేవారికి థమన్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు.
ఈ సందర్భంగా థమన్ మాట్లాడుతూ “నాకు అమ్మాయిల అలవాటు లేదు. నేను మందు కొట్టను. నాకు ఇష్టమైన క్రికెట్ మాత్రమే నాకు సంతోషాన్నిస్తుంది. ఎప్పుడు సమయం దొరికినా నా ఫ్రెండ్స్ ని తీసుకొని వెళ్లి క్రికెట్ ఆడతాను. క్రికెట్ నాకు టైం పాస్ కాదు. అదొక ఎమోషన్. ప్రతి రోజు నైట్ క్రికెట్ ఆడుకొని వచ్చి 2 గంటలంకు ఇంటికి వచ్చి స్నానం చేసి నిద్రపోతాను. అంతకంటే నాకు బెస్ట్ ఎంటర్టైన్ మెంట్ మరొకటి లేదు. ఈ విషయంలో నేను ఏ గొట్టంగాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా మీద ఏ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కంప్లైన్ట్ చేయలేదు. ఏ హీరో కూడా నన్ను ఒక్క మాట అనలేదు. అలాంటిది బయట ఎవరేమనుకుంటున్నారో నాకు అనవసరం”. అని థమన్ కాస్త ఘాటుగానే స్పందించాడు. మరి థమన్ వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.