ప్రస్తుతం రవితేజ హీరోతో పాటు నిర్మాతగా బిజీ అయ్యారు. పలు సినిమాలకు నిర్మాణ బాధ్యతలు వహిస్తున్న మాస్ మహారాజా..సుందరం మాస్టర్ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమా ద్వారా రవితేజ వైవా హర్షకి ఇచ్చిన ఒక మాట్లా నిలుపుకున్నాడు.
యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు వైవా హర్ష. వీటి ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ట్యూబర్ స్టార్.. పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. ఇటీవలే వచ్చిన ‘కలర్ ఫోటో’ వంటి సినిమాలో తన పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఇప్పుడు ‘సుందరం మాస్టర్’ సినిమాలో లీడ్ రోల్ లో కనిపించబోతున్నాడు హర్ష. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ మూవీకి దీపక్ ఎరెగడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి రవితేజ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమా ద్వారా రవితేజ వైవా హర్షకి ఇచ్చిన ఒక మాట్లా నిలుపుకున్నాడు.
మాస్ మహరాజ్ రవితేజ ఈ సినిమా నిర్మాతలలో ఒకరిగా ఉన్న సంగతిగా తెలిసిందే. అయితే గతంలో వైవా హర్ష ని ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తానని రవి తేజ చెప్పాడు. ప్రస్తుతం రవి తేజ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు సినిమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ ఏడాది రిలీజైన ‘రావణాసుర’,సినిమాకి అలాగే ‘మట్టి కుస్తీ’, ‘చాంగురే బంగారు రాజా’ వంటి సినిమాలకు నిర్మాతగా సహకారం అందించారు. సినిమా నిర్మాణాల కోసం రవితేజ్ టీమ్ వర్క్స్ పేరుతో ఓ బ్యానర్ ను కూడా ఏర్పాటు చేసాడు. చేశారాయన. ఇప్పుడు తాజాగా వైవా హర్ష ప్రధాన పాత్రలో వస్తోన్న ‘సుందరం మాస్టర్’ సినిమాను గోల్ డెన్ మీడియా బ్యానర్ సుధీర్ కుమార్ కుర్రుతో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మొత్తానికి అనుకున్నట్లుగా తన మాట నిలబెట్టుకున్నాడు మాస్ మహారాజ.
ఇక ఈ సినిమాలో హర్ష చెముడు ప్రధాన పాత్ర ఈ సినిమా తెరెక్కబోతుంది. కళ్యాణ్ సంతోష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో హర్షకు జంటగా దివ్య శ్రీపాద కనిపించనుంది. ఈ మూవీను సుధీర్ కుమార్ కుర్రుతో కలిసి మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రవితేజ్ విడుదల చేశారు. మొత్తానికి అనుకున్నట్లుగా తన మాట నిలబెట్టుకున్నాడు మాస్ మహారాజ. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.