వాళ్లిదరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరెన్నికగన్న హీరోలు .ఒకరు తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులకి ఒక బ్రాండ్ అంబాసిడర్.
వాళ్లిదరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరెన్నికగన్న హీరోలు .ఒకరు తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులకి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఇంకొకరు స్వయంకృషితో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి సినిమా సినిమా కి తన అభిమానుల్ని పెంచుకుంటు తాను కూడా తెలుగు సినిమా అగ్రనటుల్లో ఒకడు అనే పేరును సంపాదించిన నటుడు. ఒకే రోజు సినిమా ఇండస్ట్రీ లో ఏ ఇద్దరి హీరోల సినిమాలైన విడుదల కావటం సహజం. కానీ పైన చెప్పుకున్న ఇద్దరు హీరోల మాత్రం సినిమాల పరంగా ఇప్పటికి 8 సార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డారు. ఇప్ప్పుడు 9 వ సారి పోటీ పడటానికి సిద్ధం అయ్యారు. ఇప్పుడు ఈ న్యూస్ ఇరువురి హీరోల అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా సంచలనం సృష్టిస్తుంది.
యువరత్న నందమూరి బాలకృష్ణ నటనకి ఉన్న పవర్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ వారసుడిగా చిత్రరంగ ప్రవేశం చేసి అనతి కాలంలోనే నెంబర్ వన్ హీరో రేంజ్ కి వెళ్లాడు. కొన్ని లక్షలాదిమంది అభిమానుల ఆరాధ్య దైవంగా బాలకృష్ణ సినీమా ఇండస్ట్రీ లో ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాతో అక్టోబర్ లో థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ టీజర్ లో ఉన్న బాలయ్య గెటప్ ఆయన చెప్పిన డైలాగ్ సినిమా మీద అంచనాలు పెంచాయి.
రవితేజ..ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు లేడు. స్వయంకృషి తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కి ప్రవేశించి మాస్ మహారాజ గా తన అభిమానులతో పాటు ప్రేక్షకుల గుండెల్లో కొలువు తీరాడు . కామెడీ,సెంటిమెంట్,యాక్షన్ ఇలా అన్నింటిలోనూ విజృభించి నటించడం రవి తేజ సొంతం. రవితేజ డైలాగ్ డెలివరీకి లక్షలాది మంది ఫాన్స్ ఉన్నారు. తాజాగా రవితేజ టైగర్ నాగేశ్వరావు అనే పేరుతో ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు.ఆ మద్య విడుదలైన టీజర్ లో రవితేజ లుక్ ఒక రేంజ్ లో ఉంది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రవితేజ హిట్ కొట్టడం గ్యారంటీ అని అంటున్నారు
ఇక అసలు విషయంలోకి వస్తే.. బాలకృష్ణ, రవితేజలు హీరోలుగా చేసిన భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరావు సినిమాలు రెండు దసరా సందర్భంగా అక్టోబర్ లో విడుదల కాబోతున్నాయి. ఇంచు మించు రెండు సినిమాలు కొన్నిరోజుల గ్యాప్ లో రాబోతున్నాయి. ఇప్పటికే బాలయ్య, రవితేజ లు బాక్స్ ఆఫీస్ వద్ద 8 సార్లు పోటీపడ్డారు. ఇపుడు తొమ్మిదో సారి పోటీపడుతున్నారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన శ్రీమన్నారాయణ అండ్ రవితేజ హీరోగా వచ్చిన దేవుడుచేసిన మనుషులు అలాగే అధి నాయకుడు, దరువు సినిమాలు. పరమవీరచక్ర, మిరపకాయ్ సినిమాలతో పాటు ఇంకో ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డాయి.. గత సంక్రాంతికి బాలకృష్ణ హీరో గా చేసిన వీరసింహారెడ్డి కి పోటీగా వచ్చిన వాల్తేరు వీరయ్య లో కూడా రవితేజ నటించిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇద్దరు విజయదశమి బరిలో నిలబడి పోటీ పడుతుండటంతో విజయం ఎవర్ని వరిస్తుందో అని ఇరువురి అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆతృతతో వెయిట్ చేస్తూ ఉన్నారు.