బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సౌండ్.. అదే ‘రామాయణ’ జైత్రయాత్ర! నమిత్ మల్హోత్రా నిర్మాణంలో, నితేశ్ తివారీ డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, రాకింగ్ స్టార్ యశ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్ 5న విడుదలై థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాపై ఆడియెన్స్ నుంచే కాదు, సినీ సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. కానీ, అందరి ప్రశంసలు ఒకెత్తయితే.. మన కాంట్రవర్షియల్ డైరెక్టర్, సంచలనాల రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జనరల్‌గా దేవుడ్ని నమ్మని ఆర్జీవీ.. ఈ భక్తిరస చిత్రంపై ఎలాంటి కామెంట్స్ చేశారు? ఆయనకు ఈ సినిమాలో ఏం నచ్చింది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ!”
ఎప్పుడూ తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ రచ్చ లేపే రామ్ గోపాల్ వర్మ.. ఈసారి రూట్ మార్చారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ‘రామాయణ: పార్ట్ 1’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ.. ఇది కేవలం భక్తిని పంచే సినిమా మాత్రమే కాదని, అదొక ‘భక్తి శక్తి’ అంటూ సరికొత్త డెఫినేషన్ ఇచ్చారు. అంతేకాదు, సినిమాపై వచ్చే చిన్న చిన్న విమర్శలను చిత్ర యూనిట్ అస్సలు పట్టించుకోవద్దని స్ట్రాంగ్ హింట్ ఇచ్చారు ఆర్జీవీ.
ఈ సినిమాను స్క్రీన్ మీదకు తీసుకురావడానికి మేకర్స్ పడిన ఏనుగంత ప్రయత్నం ముందు.. ఈ విమర్శలు చాలా చాలా చిన్నవని వర్మ కొట్టిపారేశారు. ఇక సినిమాలో రాముడి క్యారెక్టరైజేషన్ గురించి ఆర్జీవీ చేసిన విశ్లేషణ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో కథానాయకుడు కథకు అతీతంగా గాల్లో తేలియాడే దేవుడు కాదని.. ప్రపంచం అంతం కాబోతోందని స్పష్టంగా తెలిసి కూడా, ఎంతో ధైర్యంగా ముందడుగు వేసిన ఒక గొప్ప ‘మనిషి’ అని రాముడి పాత్రను వర్మ కొనియాడారు. అలాగే సినిమాలో చూపించిన హింస కూడా పర్యవసానాల స్పష్టతను తెలియజేసేలా పర్ఫెక్ట్‌గా ఉందన్నారు.
ముఖ్యంగా రాముడిగా నటించిన రణ్‌బీర్ కపూర్, రావణుడిగా కనిపించిన యశ్ అభినయాన్ని వర్మ స్పెషల్‌గా మెచ్చుకున్నారు. సీత అపహరణ జరిగిన తర్వాత.. ఖాళీగా ఉన్న ఆశ్రమంలో రాముడు ఒంటరిగా నిలబడే సీన్ థియేటర్లలో అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆ సీన్ గురించి ఆర్జీవీ స్పందిస్తూ.. ఆ సమయంలో రణ్‌బీర్ కపూర్ నటనలో కనిపించిన దుఃఖం ఒక అంకగణితంగా మారిన తీరును కెమెరా అద్భుతంగా క్యాప్చర్ చేసిందంటూ కెమెరామెన్ వర్క్‌ని, రణ్‌బీర్ యాక్టింగ్‌ని ఆకాశానికెత్తేశారు.
అసలు.. దేవుడు, భక్తి లాంటి విషయాలకు కాస్త దూరంగా ఉండే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడే ‘రామాయణ’ సినిమాను, అందులోని ఎమోషన్స్‌ను ఇంతలా ఓన్ చేసుకున్నారంటే.. నితేశ్ తివారీ విజువల్ వండర్ ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 5న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఈ టైంలో ఆర్జీవీ చేసిన ఈ ఇంట్రెస్టింగ్ అనాలసిస్ సినిమాకు మరింత బూస్ట్‌ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరు ‘రామాయణ: పార్ట్ 1’ సినిమా చూశారా? రణ్‌బీర్, యశ్ యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? అలాగే ఆర్జీవీ రివ్యూపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ బాక్స్‌లో షేర్ చేసుకోండి.
అసలు.. దేవుడు, భక్తి లాంటి విషయాలకు కాస్త దూరంగా ఉండే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడే ‘రామాయణ’ సినిమాను, అందులోని ఎమోషన్స్‌ను ఇంతలా ఓన్ చేసుకున్నారంటే.. నితేశ్ తివారీ విజువల్ వండర్ ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 5న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఈ టైంలో ఆర్జీవీ చేసిన ఈ ఇంట్రెస్టింగ్ అనాలసిస్ సినిమాకు మరింత బూస్ట్‌ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరు ‘రామాయణ: పార్ట్ 1’ సినిమా చూశారా? రణ్‌బీర్, యశ్ యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? అలాగే ఆర్జీవీ రివ్యూపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ బాక్స్‌లో షేర్ చేసుకోండి.
The #Ramayana is not a devotional film. It is a devotional force.The hero is not a blue god floating above the story. He is a man who has already seen the end of the world and still willfully chooses to walk into it.
The rise is not of a kingdom. It is of a mind that challenges weakness. Every frame carries the weight of someone who has burned the old rules and is now moving only by the logic of power . The violence is not spectacle. It is the clarity of consequences
What separates this from every other cinematic telling is that In a time when most films are still wary to move , this one simply moves. It does not explain itself. That is why it hits harder than anything that has come before it.
You do not leave the film having watched a story. You leave it after living an experienceRanbir In the sequence after Sita’s abduction, when he stands in the empty ashram and simply looks at the place where she was, the camera holds long enough to show that grief has already been converted into a arithmetic
Yash does not play opposition. He plays the mind that has already accepted what it decided to destroy. In the long confrontation before the final night, when he speaks to Ram across the open ground with no army between them, he does not raise his voice. He simply states the price. The face never flinches. The body never shifts.
@AnupamPkher in Jatayu’s interception of the pushpak is not an act of mere loyalty. Wings half broken, bloodied, he keeps on coming because the mind has not yet accepted what the body is telling it. When he falls, the camera stays on the face. There is no cry. There is only the last argument continuing behind the eyes after his wings have stopped. That is not sacrifice. That is a man who understood the only rule left is to continue until you cannot.All in all I want to say this to each and everyone of all the greats who collaborated to make this great film is to treat any and all negative critics of this film as barking street dogs against the elephantine effort you all put in to create this magnifique piece of WONDER🙏🙏🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) November 9, 2026
