ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు వీడే పరిస్థితి కన్పించడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా రానున్న 5-6 రోజులు భారీ వర్షాలు తప్పవని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా తీరంలో తీరం దాటింది. రానున్న 12 గంటల్లో ఇది కాస్తా బలహీనపడి అల్పపీడనంగా మారవచ్చు. మరోవైపు రుతు పవన ద్రోణి సూరత్, డయ్యూ […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారింది. ఫలితంగా ఏపీ తెలంగాణలో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తీరం దాటనుంది. ఫలితంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ కొమురం భీమ్ ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, మంచిర్యాల, భూపాలపల్లి, […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో 3-4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఫలితంగా ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులిచ్చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినా ఏపీలో దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విశాఖపట్నం సమీపంలో కేంద్రీకృతం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దంచి కొడుతున్నాయి. లోతట్టు […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా బలపడింది. ఫలితంగా రానున్న 4-5 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ముందస్తుగా ప్రవేశించినా ఆశించిన వర్షపాతం కురవలేదు. కానీ గత వారం రోజులుగా సాధారణానికి మించి నమోదవుతోంది. మొన్నటి వరకు లోటు వర్షపాతం ఎదుర్కొన్న గుంటూరు, అన్నమయ్య, వైఎస్సార్ […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడుతోంది. ఈ క్రమంలో 3-5 రోజులు ఏపీలో భారీ వర్షాలు ముంచెత్తవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఇప్పటికీ భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుంచి వస్తున్న అప్‌డేట్స్ ఆందోళన కల్గిస్తున్నాయి. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా […]
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం..తుపాను గా మారి వాయువేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలోని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిలు జారీచేసింది. దక్షిణ అండమాన్ సముద్రం తీరంలో ఏర్పడిన అల్పపీడనం శనివారంకి మరింత బలపడింది. ఇది ఆగ్నేయ బంగాళా ఖాతంలో, దక్షిణ అండమాన్ సముద్రంపై ప్రస్తుతం కొనసాగుతున్నా.. ఆదివారం నాటికి తుపాను మారే అవకాశం ఉందని వాతారవరణ శాఖ తెలిపింది. ఇది రానున్న 6 గంటల్లో వాయుగుండంగా మారుతుందని, 24 గంటల తరువాత తుపాను […]
మనం నిత్య జీవితంలో చేసే ప్రతిదీ యుద్ధమే. అయితే అందులో కొన్ని యుద్ధాలు ప్రకృతితో చేయాల్సి వస్తుంది. బ్రతకాలంటే పోరాటం చేయాలి. ఇక్కడి ప్రజలు ప్రకృతితో యుద్ధమే చేస్తున్నారు. కానీ, అది వారు చేసిన తప్పుకు పడిన శిక్ష కాదు. ఎవరో చేసిన తప్పునకు వాళ్లు శిక్ష అనుభవిస్తున్నారు. ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లాలో తెలీక ఏకంగా సముద్రంతోనే సమరానికి సిద్ధమయ్యారు. తమ గ్రామాన్ని కాపాడు కోవడానికి పోరాడుతున్నారు. ఊరి మీదకి వస్తున్న సముద్రుడు ఈ కథ […]
బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 5.1గా నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం 12.35 గంటలకు భూమి కంపించింది. భూకంప ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో పలుచోట్ల స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి 260 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు 296 కి.మీ దూరంలో ఆగ్నేయంగా, చెన్నైకి 320 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంపం ప్రభావంతో తమిళనాడులోనూ ప్రకంపనలు సంభవించాయి. […]