శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
భారత్ సర్వమత సమ్మేళనం. ఇక్కడి ప్రజలు అన్ని మతాలను పూజిస్తారు, గౌరవిస్తారు. ప్రతి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగే ఇక్కడున్న దేవాలయాలు మరే దేశంలో లేవనడం అతిశయోక్తి కాదు.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సుప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి భద్రాచలంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయం. రామాయణ ఇతిహాసాలతో ముడిపడి ఉన్న దేవాలయాల్లో ఇది ఒకటి. రాముడు,సీత నడయాడిన ప్రాంతంగా కొలవబడుతోంది.
మనిషి ఆశావాది. భూమి మీద కాకుండా మానవులు జీవించగలిగే గ్రహం ఏదన్నా ఉందన్న కోణంలో అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. మనిషి మనుగడకు నీరు ముఖ్యం కాబట్టి అది ఏ గ్రహంపై ఉందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
జాతకంలో ఏలినాటి శని, శని దోషాలు ఉన్నవారు వాటి నుంచి విముక్తి పొందేందుకు ప్రత్యేకమైన రోజు వస్తుంది. అదే శని త్రయోదశి. ఈ రోజున శని దేవుడుని ప్రసన్నం చేసుకుంటే అన్ని దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
దేవాలయాలకు వెళ్లే వారు భగవంతుడి దర్శనం తర్వాత కాసేపు గుడి పరిసరాల్లో కూర్చోవడం పరిపాటి. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో అనేక జీవనదులున్నాయి. ఈ నదులే భారత దేశ సస్యశ్యామలానికి కారణం. ఎత్తైన కొండల నుండి నీరు జాలువారు, వాగులు, వంకల నుండి ప్రవహించి, మైదాన ప్రాంతాలకు చేరి నదిగా మారుతుంది. అక్కడ నుండి ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది.
ఆషాడ మాసం శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా హిందువులు పండుగ చేసుకుంటారు. శ్రీ మహా విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోని వెళ్లే సందర్భంగా పరిగణిస్తూ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.
ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశికి అత్యంత ప్రీతిపాత్రంగా పరిగణిస్తారు హిందువులు. ఎందుకంటే ఆ రోజున తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వ కాలంలో తొలి ఏకాదశినే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారని తెలుస్తోంది.
హిందువులకు ఇది తొలి పండుగ అంటే తొలి ఏకాదశి నుండి పండుగలు మొదలవుతాయి. ఈ రోజు ఇల్లును శుభ్రపరుచుకొని శుద్దిగా చేసుకుని విష్ణుమూర్తిని పూజిస్తారు. తొలిఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. మరునాడు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థప్రసాదాలు సేవిస్తారు.